Share News

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:36 AM

ఇం టర్‌ మీడియట్‌ ఫలితాల్లో జిల్లాలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో 62.45 శాతం ఫలితాలను సాధించి 12వ స్థానంలో నిలవగా, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 70.03 శాతం ఫలితాలను సాధించి రాష్ట్రంలో 11వ స్థానంలో నిలి చారు.

 ఇంటర్‌ ఫలితాల్లో   బాలికలదే పైచేయి

పెద్దపల్లి కల్చరల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఇం టర్‌ మీడియట్‌ ఫలితాల్లో జిల్లాలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో 62.45 శాతం ఫలితాలను సాధించి 12వ స్థానంలో నిలవగా, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 70.03 శాతం ఫలితాలను సాధించి రాష్ట్రంలో 11వ స్థానంలో నిలి చారు. ఎంపీసీ, బైపీసీలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఫలితాల్లో జిల్లా మెరుగైంది. ప్రథమ సంవత్సరంలో 16.14 శాతం ఫలితాలు పెరగగా, రాష్ట్రస్థాయిలో 19వ స్థానం నుంచి 12వ స్థానానికి రావడం గమనార్హం. ద్వితీయ సంవ త్సరంలో 10.71 శాతం ఫలితాలు పెరగగా, 14వ స్థానం నుంచి 11వ స్థానానికి చేరుకున్నది.

ఫ ప్రథమ సంవత్సరం పరీక్షలకు జనరల్‌ విభా గంలో 3827 మంది విద్యార్థులు హాజరు కాగా, 2659 మంది 62.45 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 1558 మందికి 759 మంది 48.72 శాతం, బాలికలు 2269 మందికి 1631 మంది 71.88 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌ కోర్సుల్లో 1069 మంది విద్యార్థులకు 650 మంది 60.85 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 501 మందికి 212 మంది 42.32 శాతం, బాలికలు 568 మంది విద్యార్థులకు 438 మంది 77.11 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఫ ద్వితీయ సంవత్సరం జనరల్‌ పరీక్షల్లో 3797 మంది విద్యార్థులకు 2659 మంది 70.03 శాతం ఉత్తీ ర్ణులయ్యారు. ఇందులో బాలురు 1579 మందికి 895 మంది 56.68 శాతం, బాలికలు 2218 మందికి 1764 మంది 79.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌ విభాగంలో 918 మందికి 700 మంది 76.25 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు 407 మంది విద్యా ర్థులకు 236 మంది, 57.99 శాతం, బాలికలు 511 మందికిగాను 464 మంది విద్యార్థులు 90.80 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఫ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు..

సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లిలో గల మోడల్‌ స్కూల్‌లో చదువుతున్న ఎన్‌ స్వప్న ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో ఎంపీసీలో 1000 మార్కులకు గాను, అత్యధి కంగా 984 మార్కులు సాధించారు. సుల్తానాబాద్‌ ప్రభుత్వ కళాశాలకు చెందిన నవీన్‌కుమార్‌ 980 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. బైపీసీలో 1000 మార్కులకు గాను 953 మార్కులు సాధిం చారు. మంథని బాలికల ప్రభుత్వ కళాశాలకు చెందిన శ్రీజ మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. గోదావరిఖని ప్రభుత్వ బాలికల కళాశాలకు చెందిన స్ఫూర్తి అనే విద్యార్థి హెచ్‌ఈసీలో 1000 మార్కులకు 978 మార్కులు సాధించారు.

ఫ వచ్చే నెల 22 నుంచి అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు

ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణులు కానీ విద్యార్థులు తిరిగి పరీక్షలు రాసేందుకు వచ్చే నెల 22వ తేదీ రెండు సెషన్లలో అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహిం చనున్నారని ఇంటర్‌ నోడల్‌ అధికారి బి కల్పన తెలి పారు. ఇందుకోసం ఆయా కళాశాలల్లో ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. అలాగే రీ కౌంటింగ్‌ కోసం ఈ నెల 23 నుం చి 30వ తేదీ లోపు ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపా యలు, రీ వాల్యూయేషన్‌, స్కాన్‌ చేసిన జవాబు పత్రాల కోసం ఒక్కో సబ్జెక్టుకు 600 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 01:36 AM