బాలికలదే పైచేయి
ABN , Publish Date - May 01 , 2025 | 12:38 AM
జగిత్యాల, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో బాలికలు సత్తా చాటారు. జిల్లాలో మొత్తం ఉత్తీర్ణత 98.20 శాతం కాగా అందులో బాలికలు 98.74 శాతం పాస్ కాగా బాలురు 97.67 శాతం ఉత్తీర్ణత సాధించారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లాలో బాలుర కంటే బాలికలు 1.07 శాతం అధిక ఉత్తీర్ణతను సాధించారు. గత యేడాది జిల్లాలో 95.76 శాతం ఉత్తీర్ణత వచ్చింది. గత యేడాదితో పోలిస్తే ఈ ఏడాది 2.98 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లను ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది.
-ఎస్సెస్సీలో జిల్లాలో 98.20 శాతం ఉత్తీర్ణత
-బాలికలు 98.74 శాతం, బాలురు 97.67 శాతం పాస్
-రాష్ట్రంలో జిల్లాకు నాలుగో స్థానం
జగిత్యాల, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో బాలికలు సత్తా చాటారు. జిల్లాలో మొత్తం ఉత్తీర్ణత 98.20 శాతం కాగా అందులో బాలికలు 98.74 శాతం పాస్ కాగా బాలురు 97.67 శాతం ఉత్తీర్ణత సాధించారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లాలో బాలుర కంటే బాలికలు 1.07 శాతం అధిక ఉత్తీర్ణతను సాధించారు. గత యేడాది జిల్లాలో 95.76 శాతం ఉత్తీర్ణత వచ్చింది. గత యేడాదితో పోలిస్తే ఈ ఏడాది 2.98 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లను ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది.
ఫపెరిగిన ఉత్తీర్ణత శాతం
రాష్ట్రంలో 98.20 శాతం ఉత్తీర్ణతను సాధించి జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రస్తుత యేడాది 11,849 మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 5,962 మంది బాలురు, 5,887 మంది బాలికలు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 11,636 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 5,823 మంది బాలురు కాగా 5,813 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. గత యేడాదితో పోలిస్తే ఈ ఏడాది 2.98 శాతం ఉత్తీర్ణత పెరిగింది.
ఫసత్తాచాటిన గురుకులాలు
జిల్లాలోని పలు గురుకుల పాఠశాలలు తమ సత్తాను చాటాయి. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించగా, ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు 94.66 శాతం, మైనార్టీ గురుకుల పాఠశాలలు 98.58 శాతం, మోడల్ పాఠశాలలు 99.07 శాతం, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ పాఠశాలలు 99.38 శాతం, కేజీబీవీలు 97.49 శాతం ఫలితాలను సాధించాయి. జిల్లాలోని జడ్పీ పాఠశాలలు 97.75 శాతం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 93.18 శాతం ఫలితాలు సాధించాయి. జిల్లాలో ప్రైవేటు పాఠశాల విద్యార్థులు 98.90 శాతం ఫలితాలు సాధించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జడ్పీ, వివిధ ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ల పరిధిలో 233 పాఠశాలలు ఉండగా 153 పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించాయి. ప్రైవేటులో 103 ఉన్నత పాఠశాలలు ఉండగా 68 పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించాయి. జిల్లా వ్యాప్తంగా 4,356 మంది ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 4,306 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఫమూడు మండలాల్లో 100శాతం ఉత్తీర్ణత
జిల్లాలో బీర్‌పూర్, బుగ్గారం, ఎండపల్లి మండలాలు 100 శాతం ఫలితాలు సాధించాయి. అత్యల్పంగా కొడిమ్యాల మండలం 95.17 శాతం సాధించి జిల్లాలో చివరి స్థానంలో ఉంది. ధర్మపురిలో 98.59 శాతం, గొల్లపల్లిలో 99.77శాతం, ఇబ్రహీంపట్నంలో 99.05 శాతం, జగిత్యాలలో 97.73 శాతం, జగిత్యాల రూరల్‌లో 99.03 శాతం, కథలాపూర్‌లో 98.80 శాతం, కొడిమ్యాలలో 95.17 శాతం, కోరుట్లలో 96.99 శాతం, మల్లాపూర్‌లో 99.29 శాతం, మల్యాలలో 99.37 శాతం, మేడిపల్లిలో 98.24 శాతం, మెట్‌పల్లిలో 98.04 శాతం, పెగడపల్లిలో 99.04 శాతం, రాయికల్‌లో 99.46 శాతం, సారంగాపూర్‌లో 99.53 శాతం, వెల్గటూరు మండలంలో 97.17 శాతం ఫలితాలు వచ్చాయి.
ఫజూన్ 3 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. ఇందుకు గాను మే 16వ తేదీ లోపు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు మే 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. కాగా అర్హులైన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రాము తెలిపారు.