స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:56 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.
భగత్‌నగర్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ, మండల కార్యదర్శుల సమావేశంలో మాట్లాడారు. అత్యధికంగా ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను గెలుచుకునేందుకు కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సర్పంచ్, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి దాదా పుగా 20 నెలలు అవుతోందని, 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చట్టం ఆమోదించినా చేపట్టకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.