Share News

ఆపరేషన్‌ కగార్‌ పేరిట నరమేధం

ABN , Publish Date - May 23 , 2025 | 12:17 AM

దండకారణ్యంలో ఉన్న మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం అపరేషన్‌ కగార్‌ పేరు తో నరమేధాన్ని సృష్టిస్తోందని, ఈ హత్యలను ప్రజాస్వామికవాదులు ఖండించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు.

ఆపరేషన్‌ కగార్‌ పేరిట నరమేధం

సిరిసిల్ల రూరల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి) : దండకారణ్యంలో ఉన్న మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం అపరేషన్‌ కగార్‌ పేరు తో నరమేధాన్ని సృష్టిస్తోందని, ఈ హత్యలను ప్రజాస్వామికవాదులు ఖండించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌నగర్‌లోని సీపీఐ కార్మిక భవనంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అబూజ్‌మడ్‌ అడవుల్లో జరి గిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారికి నివాళులు అర్పించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా మధ్య భారత అడవుల్లో భారత ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరుతో నరమేధాన్ని సృష్టిస్తోందన్నారు. ఛతీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్‌ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అడవుల్లో కేంద్ర ప్రభుత్వ పోలీస్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో మవోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియస్‌ బస్వరాజ్‌తో పాటు 34 మంది మావోయిస్టులు చనిపోవడం బాధాకరమన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆ పార్టీ కేంద్ర నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరడంతో పాటు ఆపరేషన్‌ కగార్‌ను ఆపివేయాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దేశపౌరులను మావోయిస్టుల పేరుతో హత్యలు చేస్తూ పోతుందని, అడవుల నుంచి మావోయిస్టుల ఏరివేత పేరుతో అదివాసీలను తమ గ్రామాల నుంచి ఖాళీ చేయించి అటవీ సంపదలను కార్పొరేట్‌ కంపెనీ లకు, బడా పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరే షన్‌ కగార్‌ను చేపట్టిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేసి పారామిలిటరీ బలగాలను వెనుకకు రప్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలపై సిట్టింగ్‌ జడ్జీ తో విచారణ జపించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ నాగరాజు, జిల్లా నాయకులు కిషోర్‌లు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:17 AM