గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:02 AM
శాంతియుత వాతావరణం లో గణేవ్ ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీమహేష్ బి. గీతే అన్నారు.
సిరిసిల్ల క్రైం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): శాంతియుత వాతావరణం లో గణేవ్ ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీమహేష్ బి. గీతే అన్నారు. రానున్న గణేశ్ ఉత్సవాల సందర్భంగా శనివారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణమండపంలో సిరిసిల్ల సబ్ డివిజన్ లోని గణేశ్ మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యు లతో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో ఎస్పీ దిశానిర్ధేశం చేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపాల వద్ద, నిమర్జనం సమయంలో డీజేలకు అనుమతిలేదన్నారు. ఇప్పటికే డీజే యజమాను లకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ప్రతిఒక్కరు ఆన్‌లైన్‌లో అనుమ తి తీసుకోవాలన్నారు. గణేశ్ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలన్నారు. గణేశ్ ఉత్సవాల్లో నిబంధనలు ఉల్లం ఘిస్తే చర్యలు తప్పవన్నారు. మండపాల పూర్తి బాధ్యత నిర్వా హకులదేనని, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాల నిఘా ఉండా లన్నారు. దీంతో ఏ చిన్న సంఘటన జరిగినా గుర్తించే వీలుం టుందన్నారు. మండపాల వద్ద మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారితో పాటుగా మండపాల నిర్వా హకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి మండపం వద్ద విధిగా బుక్ పాయింట్ ఏర్పాటుచేస్తామన్నారు. గణేశ్ మం డపాలను తరచుగా పోలీసులు తనిఖీలు చేస్తారన్నారు. మండ పాలను ఇనుప వస్తువులతో ఏర్పాటు చేయకూడదని, విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలన్నారు. గణేశ్ శోభాయాత్రను అర్ధరా త్రి 12గంటల వరకు పూర్తిచేసే బాధ్యతను నిర్వాహకులు తీసుకో వాలన్నారు. ప్రజలకు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. గత ఏడాది శాంతిభద్రతలకు విఘాతం కలి గించినవారిపై కేసులు నమోదుచేశామన్నారు. సమావేశంలో సిరిసిల్ల బాఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాధిర్‌పాష, టౌన్ సీఐ కృష్ణ, ఎస్‌ఐ శ్రీకాంత్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు దూమాల శ్రీకాంత్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు చేపూరి అశోక్, మేర్గు సత్యనారాయణ, అన్నిమండలాల పలు పార్టీల నాయకులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.