Share News

ప్రశాంత వాతావరణంలో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించాలి

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:53 AM

ప్రశాంత వాతావరణంలో గణేష్‌ ఉత్సవాలను నిర్వహించడానికి అధికా రులు చర్యలు తీసుకోవాలని స్థానిక శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ప్రశాంత వాతావరణంలో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించాలి

వేములవాడ కల్చరల్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రశాంత వాతావరణంలో గణేష్‌ ఉత్సవాలను నిర్వహించడానికి అధికా రులు చర్యలు తీసుకోవాలని స్థానిక శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రాజన్న ఆలయ గుడి చెరువులో గణేష్‌ నిమజ్జనం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రాజన్న ఆలయ సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్‌ సందీప్‌కు మార్‌ ఝా, ఎస్పీ మహేష్‌ బీ గితేలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆగస్టు 27వ తేది నుంచి సెప్టెంబరు 6వ తేది వరకు గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం జరగనున్నాయని, వీటికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని సూచించా రు. గత ఏడాది పోలీస్‌ శాఖ ద్వారా సుమారు 300 రిజిస్ర్టేషన్‌ చేసుకుని, 100 రిజిస్ర్టేషన్‌ లేకుండా.. మొత్తం 400 విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు తెలిపారు. ఈసారి విగ్రహాల సంఖ్య పెరిగే అవ కాశం ఉందన్నారు. నిమజ్జన సమయంలో ఇబ్బందులు రాకుండా అవ సరమైన పెద్ద క్రేన్లు ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ గుడి చెరు వులో నిమజ్జనం భక్తిభావంతో జరిగేలా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. నిమజ్జనం సందర్భంగా డీజే, క్రాకర్స్‌కు అనుమతి ఇవ్వవద్దని అన్నారు. లైటింగ్‌ తాగునీరు సరఫరా, బారికేడ్లు వంటి ఏర్పాట్లు చేయాలన్నారు. అవసర మైన మేర గజఈతగాళ్లను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. నిమజ్జ నం ప్రశాంతంగా జరిగేలా ప్రతి పాయింట్‌ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధి కారులతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేయాలని సూచించారు.

మండపాల వివరాలను నమోదు చేసుకోవాలి

వేములవాడ పట్టణంలోని గణేష్‌ మండపాలలోని విగ్రహాలకు జీపీ ఎస్‌ జియోట్యాగింగ్‌తో సహా మండపాల వివరాలు తప్పకుండా నమో దు చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా అన్నారు. గణేష్‌ నిమజ్జ నానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలని, గణేష్‌ విగ్రహం నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకోవా లని, అవసరమైన రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. పాయింట్ల వద్ద పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ఏర్పాటు చేయాలని, కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి గణేష్‌ విగ్రహానికి టోకెన్‌ అందించి, వాటి మూమెంట్‌ మానిటరింగ్‌ చేయాలన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో పండగ వాతావరణంలో గణేష్‌ ఉత్సవాలన నిర్వహించుకోవాలని పే ర్కొన్నారు. అనంతరం ఏస్పీ మహేష్‌ బీ గితే మాట్లాడుతూ నిమజ్జనం సమయంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రూట్‌మ్యాప్‌ ఫైనల్‌ చేయాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. ఎక్కడా కూడా వైన్స్‌ అమ్మడానికి వీలు లేదని, బెల్టు షాపుల వద్ద సైతం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పెద్ద విగ్రహాల తరలింపు రూట్‌లను ముందుగా పరిశీలించ, అక్కడ ఎటువంటి కేబుల్‌ వైర్‌ ఇంటర్నెట్‌ వైర్స్‌, విద్యుత్‌ తీగలు అడ్డు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో రాధాబాయి, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, జిల్లా ఫైర్‌ సర్వీస్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ, సెస్‌, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:53 AM