Share News

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:54 PM

మహాత్మాగాంధీ జయంతి వేడుకల ను గురువారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

సిరిసిల్ల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జయంతి వేడుకల ను గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో గాంధీజీ చిత్రపటానికి అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పో రాటంలో గాంధీజీ సేవలను కొనియాడారు. ఆ మహనీయుడి బాటలో ముం దుకు సాగాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సిరిసిల్ల క్రైం : మహాత్మగాంధిజీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఎస్పీ మహేష్‌ బి. గీతే అన్నారు. గురువారం జాతిపిత మహాత్మాగాంధిజీ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మహాత్మాగాంధి చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు.

సిరిసిల్ల టౌన్‌ : జిల్లాలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జాతిపిత మహాత్మ గాంధీ జయంతి వేడుకలు జరగాయి. సిరిసిల్ల పట్టణం గాంధీ చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు వేరు వేరుగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాయి. కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, టీపీసీసీ కో ఆర్డినేటర్‌ సంగీతం శ్రీనివాస్‌, చేనేత సెల్‌ జిల్లా అధ్యక్షుడు గోనె ఎల్లప్ప, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, సిరిసిల్ల అర్బన్‌ బ్యాంక్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ నీలి రవీందర్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, నాయకులు చాంద్‌పాషా, ఎండీ సత్తార్‌, కొండ శ్రీనివాస్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సీనియర్‌ సిటీజన్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు, సిరిసిల్ల ఆర్యవైశ్య సంఘం నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Oct 03 , 2025 | 11:54 PM