గంగమ్మ ఒడికి గణపయ్య..
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:03 AM
వేములవాడ పట్టణంలో గురువారం రాజన్న ఆలయ గుడి చెరువులో మున్సిపల్ ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వేములవాడ కల్చరల్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వేములవాడ పట్టణంలో గురువారం రాజన్న ఆలయ గుడి చెరువులో మున్సిపల్ ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో 5 భారీ క్రేన్‌లను, పదిమంది గజ ఈతగాళ్లతో పాటు గుడి చెరువులో బోట్ సౌకర్యాన్ని కల్పించారు. గుడి చెరువులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, గణేష్ నిమజ్జనోత్సవాలను చూసేందుకు పట్టణ ప్రజలు, భక్తులు తరలివచ్చారు. నిమజ్జనోత్సవాలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గుడి చెరువులో ఏర్పాట్లను పరిశీలించారు. అంతకు ముందు రాజన్న ఆలయంలో ప్రతిష్టించిన వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. పట్టణంలోని పలు వినాయక మండపాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలో పాల్గొని డప్పుకళాకారులతో నృత్యం చేస్తూ రాజన్న ఆలయం ముందు ఒగ్గుడోలు కొడుతూ శోభాయాత్రలో సందడి చేశారు.
భారీగా తరలివచ్చిన భక్తులు..
వేములవాడ పట్టణలోని గుడి చెరువులో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జనోత్సవాలను వీక్షించేందుకు భక్తు లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారులు భక్తు లతో సందడిగా మారిపోయాయి. గుడి చెరువులో చేసి న గణేష్ నిమజ్జనాలను వీక్షిస్తూ తమ సెల్‌ఫోన్‌లో ఫ ోటోలను తీస్తు సందడిగా గడిపారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం జరిగే స్థలాల్లో గుడి చెరువు వైపు భక్తులు వెళ్లకుండా చూట్టు తాళ్లతో భద్రత ఏర్పాట్లను చేశారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన నిమజ్జన వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీ మహేష్ బి. గితే, ఏ ఎస్పీ శేషాద్రినిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ సీఐ వీరప్రసా ద్, రూరల్ సీఐ శ్రీనివాస్‌లతో పాటు మున్సిపల్ కమి షనర్ అన్వేష్, మేనేజర్ సంపత్‌రెడ్డి, తహసీల్దార్‌లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రధాన రహ దారుల నుంచి భారీగా గణనాథులు తరలిరావడంతో మండపాల నిర్వాహకులతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 200మంది సిబ్బందితో బందోబస్తుతో సమన్వయపరు స్తూ వినాయకులు త్వరగా వెళ్లేందుకు కృషి చేశారు.
శోభాయాత్రలో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు
గణేష్ నిమజ్జనోత్సవ శోభయాత్రలో బీజేపి రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణతో పాటుగా బీజేపి నాయకులు నృత్యాలు చేశారు. రాజన్న ఆలయం ముందు గణేష్‌ల వద్ద ఒగ్గుడోలు కళాకారులతో డోలు కొడుతూ సందడి చేశారు. బీఆర్‌ఎస్ నేత చల్మెడ లక్ష్మీనర్సింహారావు, ఏనుగు మనోహర్‌రెడ్డితో పలు వలువురు పాల్గొని సందడిగా గడిపారు.
రాజన్న ఆలయంలో..
వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతిష్టించిన గణ నాథుడి నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలో పాలొ ్గన్న ఈవో రమాదేవి శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం రాజన్న ఆలయ ధర్మగుండంలో గణనాథు డిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవోలు, సూపరిండెంట్‌లు పాల్గొన్నారు.