నిధులు మంజూరు చేయాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:43 AM
వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాలకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
వేములవాడ టౌన్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాలకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మంగళవారం కలిసి పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కలికోట సూరమ్మ కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి భూసే కరణ నిధులు మంజూరు చేయాలని కోరారు. కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల వరద ప్రధాయని కలికోట సూరమ్మ చెరువు నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజలకు దన్నుగా నిలువాలని కోరారు. ఇప్పటికే గత పది రోజుల క్రితం కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి రూ. 10 కోట్లు నిధులు మంజూరు చేశారని, మరికొన్ని నిధులు మంజూరు చేస్తే కుడి, ఎడమ కాల్వ నిర్మాణం పూర్తి అవు తుందని సీఎంకు వివరించారు. గతంలో పీసీస అధ్యక్షులు గా సీఎం రేవంత్‌రెడ్డి ఉన్న సమయంలో కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టును స్వయంగా వచ్చి పరిశీలించారని, ఆనాడు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ప్రాజెక్టు పనిని ప్రారంభించి మత్తడి నిర్మాణం పూర్తి చేసు కున్నామని అన్నారు. కుడి, ఎడమ కాల్వ పనులు పూర్తి అయితే సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు అందిం చేందుకు వీలుంటుందన్నారు. చందుర్తి మోత్కురావుపేట రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మూల వాగు, పెంటి వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించాలని సీఎంను కోరారు.