ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు పూర్తి సహకారం
ABN , Publish Date - May 29 , 2025 | 12:23 AM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభు త్వం పూర్తిసహకారం అందిస్తుందని కలెక్ట ర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
సిరిసిల్ల కలెక్టరేట్, మే 28 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభు త్వం పూర్తిసహకారం అందిస్తుందని కలెక్ట ర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణాలు పురోగతి తదితర అంశాలపై ఆయా మండల ప్రత్యేక అధికా రులతో కలెక్టరేట్‌లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా రా ష్ట్రంలో జిల్లా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీలో ప్రథమ స్థానంలో నిల వడంలో కృషిచేసిన అధికారులందరికీ కలె క్టర్ అభినందనలు తెలిపారు. ఇదే విధంగా ఇండ్ల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయించాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వివిధ దశల్లో మొత్తం పది ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉంటుందని తెలిపారు. దానికి సంబంధించి ఆయాగ్రామాల కార్యదర్శులు, పట్టణాల్లో వార్డుఆఫీసర్లు తమ తహసీల్దా ర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మ హిళా సంఘాలకు ఇటుక బట్టీలు, సెంట్రిం గ్ దుకాణాలు ఏర్పాటుచేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు ఇళ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. మోడల్ హౌస్‌ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని హౌ సింగ్ అధికారులను ఆదేశించారు. ఇందిర మ్మ మోడల్‌హౌస్‌లను ఇందిరమ్మ లబ్ధిదా రులకు చూపించాలని పేర్కొన్నారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల జారీ లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలి చినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు మంజూరైన 7862 ఇళ్లకు 7808 అలాట్మెంట్ ఆర్డర్లు ల బ్ధిదారులకు అందజేసినట్లు వెల్లడించారు.