Share News

బీసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు..

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:17 AM

బీసీ సంఘాల పెద్దలు 42 శాతం రిజర్వేషన్‌ రాజకీయ, విద్యా, ఉద్యోగపరంగా ఇవ్వా లని ఇచ్చిన బంద్‌ పిలుపునకు కాంగ్రెస్‌ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతును తెలుపుతున్నామని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు.

బీసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు..

సిరిసిల్ల, ఆక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : బీసీ సంఘాల పెద్దలు 42 శాతం రిజర్వేషన్‌ రాజకీయ, విద్యా, ఉద్యోగపరంగా ఇవ్వా లని ఇచ్చిన బంద్‌ పిలుపునకు కాంగ్రెస్‌ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతును తెలుపుతున్నామని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం రాజన్న సిరి సిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్‌ క్లబ్ల్‌లో విలేకర్ల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ 42శాతం రాజకీయ, విద్యా, ఉద్యోగా ల్లో బీసీలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పామన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి బీసీ బిడ్డ కానప్పటికీ అసెంబ్లీలో 42 శాతానికి సంబంధించిన రిజర్వేషన్‌పై బిల్లులను ప్రవేశపెట్టడం ఆ బిల్లులను బలపరిచే అవకాశం బీసీ బిడ్డగా తనకు వచ్చిం దన్నారు. రెండు బిల్లులు కూడా గవర్నర్‌, రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఆగిందని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కృత నిశ్చయంతో ముందుకు పోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో హైకోర్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత స్టే వచ్చిందని అన్నారు. సుప్రీం కోర్టులో 50శాతం క్యాప్‌ మించి ఇవ్వవచ్చు అనే వాదన చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి సంబంధించిన ప్రజా సంఘాల ప్రజలను మేల్కొల్పే విధంగా 42 శాతం రిజర్వేషన్‌ అమలు కావాలని కోరుకుంటూ ఇచ్చిన బంద్‌ పిలుపునకు మద్దతు ఇస్తున్నామని అన్నారు. అన్నివర్గాల ప్రజలు సహకరించాలని అన్నారు. బీజేపీ బీసీల పక్షాన నిలబడాలని కోరారు. శాసనసభలో 8 మంది ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వం వద్ద 8 మంది ఎంపీలు ఎందుకు వద్దంటున్నారో బీసీ సమాజానికి సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్రపతి, గవర్నర్‌ అపాయింట్మెంట్‌ కూడా దొరకని సందర్భాలను గుర్తు చేశారు. జీవో 9 తీసుకొస్తే బీజేపీ చీఫ్‌ రామచంద్రరావు స్వాగతిస్తున్నారని, నరేంద్ర మోదీ వద్ద మాత్రం నోరు విప్పడం లేదన్నారు బీసీ బిడ్డల నోటి కాడికి వచ్చిన ముద్దను లాక్కోవద్దని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో 50 శాతం క్యాప్‌ ఎక్కడ లేదని, కోర్టులో జీవో 9పై సవాల్‌ చేశారుకానీ చట్టంపై కాదన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాండ్లు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, మార్కె ట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ చేనేత సెల్‌ అధ్యక్షుడు గోనె ఎల్లప్ప, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు దేవయ్య. ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:17 AM