Share News

రేవంత్‌రెడ్డి పాలనలో ఓనర్‌ నుంచి ఆటోడ్రైవర్‌..

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:28 AM

కేసీఆర్‌ ప్రభుత్వంలో ఆటోడైవర్లను డ్రైవర్‌ నుంచి ఓనర్‌ చేయాలని చూస్తే రేవంత్‌రెడ్డి పా లనలో ఓనర్‌ నుంచి ఆటోడ్రైవర్‌ అవుతున్నారని మాజీ మంత్రి, సిరి సిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.

రేవంత్‌రెడ్డి పాలనలో ఓనర్‌ నుంచి ఆటోడ్రైవర్‌..

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ ప్రభుత్వంలో ఆటోడైవర్లను డ్రైవర్‌ నుంచి ఓనర్‌ చేయాలని చూస్తే రేవంత్‌రెడ్డి పా లనలో ఓనర్‌ నుంచి ఆటోడ్రైవర్‌ అవుతున్నారని మాజీ మంత్రి, సిరి సిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ ఎస్‌ భవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన ఆటో డ్రైవర్లకు ఆత్మీయభరోసా సభ జరిగింది. ముఖ్యఅతిథి కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. ఆటో అన్నలతో తమకు కొత్త బంధం కాదని, తెలంగా ణ ఉద్యమంలో సంబండ వర్గాలతో కలసి కొట్లాడామని, అందులో వారి పాత్రను మరవలేమన్నారు. రాష్ట్రంలో దాదాపు 7లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని, వారు అడగకముందే నాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.5లక్షల ప్రమాద బీమా సౌకర్యల కల్పించాడన్నారు. అసం ఘటిత రంగంలో ఉన్న దాదాపు 13 లక్షల మంది డ్రైవర్లకు కూడా ప్రమాద బీమాను కల్పించాడన్నారు. కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమం త్రి అయి ఉంటే ప్రతి ఒక కుటుంబానికి బీమా వచ్చేదన్నారు. బీడీలు చుట్టే నాలుగున్నర లక్షల ఆడబిడ్డలకు రూ.2వేలు పెన్షన్‌ ఇచ్చి కేసీఆర్‌ కార్మిక పక్షపాతిగా నిలబడ్డారన్నారు. మార్పు మార్పు అనే మోసం ఎట్లా ఉంటుందో రెండు సంవత్సరాలో అందరూ చూశారన్నారు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి చేతులో మోసపోని ఏవర్గం ప్రజలు లేరని ఆరోపించారు. రైతులు, కౌలు రైతులను మోసం చేశాడని బోనస్‌ ఇస్తానని మోసం చేశాడన్నారు. రెండు లక్షల రైతు రుణాలు మొత్తం ఇవ్వాలంటే రూ 50 వేల కోట్లు ఇవ్వాలని వీళ్లిచ్చింది రూ.12 వేల కోట్లు మాత్రమే, దేవుళ్లపై ఓట్లు వేసి మాటతప్పారని ఆరో పించారు. కేసీఆర్‌ కొలువు పోతేను కొత్త కొలువులు వస్తాయని సంత్స రానికి 2లక్షల ఉద్యోగాలిస్తామంటే తల్లిదండ్రులు కూడా ఓటేసి గెలిపి స్తే వాళ్లను కూడా రేవంత్‌రెడ్డి మోసం చేశాడని విమర్శించాడు. అత్త కు రూ.4వేలు, కోడలుకు రూ.2500 ఇస్తానని రాష్ట్రంలోని కోటి 67లక్షల ఆడబిడ్డలను కూడా మోసం చేశాడన్నారు. ఆడబిడ్డలకు తులం బంగా రు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానన్నాడి ఇచ్చిండా అని ప్రశ్నించాడు. ఎల్లారెడ్డిపేట ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం కల్చివేసిం దని జిల్లాలోని ప్యాసింజర్‌, ట్రాలీఆటోలు, జీప్‌లు, వ్యాన్‌లు, లారీలు, టాక్సీలు, ట్రాక్టర్‌ డైవర్ల లిస్టులు కూడా తీయాలని వారికి కూడా సంక్రాంతి వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. జిల్లాలో ని ఆటో డ్రైవర్లందరికి ఉచితంగా చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో వైద్యం అందిస్తామన్న చల్మెడ లక్ష్మీనరసిహారావుకు ధన్య వాదాలు తెలిపారు. జిల్లాలో ఆటో డ్రైవర్లందరు క్రెడిట్‌ సొసైటీగా ఏర్పడితే కొన్ని రుణాలు వస్తాయని సూచించారు. 16 సంత్సరాల క్రితం కేసీఆర్‌ కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని కాంగ్రెసోడు ఏది మార్యాద గా ఇయ్యడు గల్లపట్టుకోవాల క్యారే అంటే ఇస్తాడన్నారు. నాలుగు నెల లో అన్ని జిల్లాలో ఆటో సంఘాలను సంఘటితం చేయాలని రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డును పెట్టకపోతే పిబ్రవరిలో హైదరాబాద్‌ వేధికగా మహాధర్నాకు దిగుదాం అన్నారు. అనంతరం జిల్లాలోని 5వేల మంది ఆటోడ్రైవర్లకు ప్రమాదబీమా కార్డును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ రాష్ట్రకార్యదర్శి గూడూరి ప్రవీన్‌, వేములవాడ నియోజకవర్గం ఇంచార్జి చల్మెడ లక్ష్మినర్సింహరావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపా ణి, బీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్‌, జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్‌, జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పి చైర్‌ పర్సన్‌ తుల ఉమ, జిల్లా మాజీ జడ్పి చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మాజీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఆటో యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్‌, అధ్యక్షుడు అల్లె శ్రీనివాస్‌, వివిధ మండలాల అటో యూ నియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:28 AM