Share News

మహిళా సమస్యలకు శుక్రవారం సభ పరిష్కార వేదిక

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:15 AM

మహిళా సమస్యలన్నింటికీ శుక్రవారం సభ ఒక పరిష్కార వేదికగా నిలుస్తుందని జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి అన్నారు. మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌ రూరల్‌ మండలం ఎలబోతారం అంగన్‌వాడీ కేంద్రంలో, హైస్కూల్‌ ప్రాంగణంలో శుక్రవారం సభ నిర్వహించారు.

మహిళా సమస్యలకు శుక్రవారం సభ పరిష్కార వేదిక
మొక్కలు నాటుతున్న జిల్లా సంక్షేమ అదికారిని సరస్వతి, ఎంపీడీవో సంజీవరావు తదితరులు

కరీంనగర్‌ రూరల్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): మహిళా సమస్యలన్నింటికీ శుక్రవారం సభ ఒక పరిష్కార వేదికగా నిలుస్తుందని జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి అన్నారు. మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌ రూరల్‌ మండలం ఎలబోతారం అంగన్‌వాడీ కేంద్రంలో, హైస్కూల్‌ ప్రాంగణంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మహిళల తమ సమస్యలు ఏమైనా ఉంటే సభలో విన్నవించుకోవచ్చని, ప్రతి మహిళ, గర్భిణి, బాలింత శుక్రవారం సభకు తప్పక హాజరు కావాలని సూచించారు. సభలో పలు విషయాలు చర్చించుకోవడం ద్వారా మహిళల్లో మానసిక ఉత్తేజం కలుగుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో ప్రాథమిక విద్యతో పాటు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పిల్లలు సృజనాత్మకతను పెంపొందించే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో జిల్లాలో మహిళలందరికీ 50రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని వీటిని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్ష అందుబాటలో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంజీవరావు, సీడీపీఓ సబిత, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధా, ఎంఈఓ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 12:15 AM