Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక..

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:41 AM

ఇందిరమ్మ ఇళ్ల కు ఉచితంగా ఇసుకను అందిస్తామని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక..

ఇల్లంతకుంట, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల కు ఉచితంగా ఇసుకను అందిస్తామని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. జంగమరెడ్డిపల్లె గ్రామంలోని శ్రీమాతా అన్నపూర్ణేశ్వరి కళ్యాణ మండపంలో మంగళవారం 760మంది ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో కలిసి ప్రొసీడింగ్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇచ్చిన హమీలను అమలు చేస్తున్నామన్నారు. పేదలకు పెట్టుబడి సాయం కింద మహిళా సంఘూల ద్వారా రూ లక్ష రుణాన్ని అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు తాగునీటి, విద్యుత్‌ సరఫరా, రోడ్ల సౌకర్యం కల్పించి త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. రైతులకు పంట నష్టపరిహారాన్ని గత ప్రభుత్వం ఇవ్వలేదనే విషయాన్ని రైతులు గమనించాలన్నారు. ప్రజాప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ 10వేలు అందజేశామన్నారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సహా యం గురించి దళారులకు డబ్బులు ఇవ్వవద్దన్నారు. మండలంలో ఉన్న 34గ్రామాలకు ఇసుక రీచ్‌లను అలాట్‌ చేశామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులు నెలరోజుల్లోగా నిర్మాణ పను లు ప్రారంభించాలని లేనట్లయితే రద్దు అయ్యే అవకాశం ఉంద న్నారు. ఈ సమావేశంలో గృహనిర్మాణశాఖ పీడీ శంకర్‌, మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, తహసీల్దార్‌ ఫారూఖ్‌, ఎంపీడీఓ శశికళ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీ పీలు రమణారెడ్డి, అయిలయ్య, నాయకులు మహేందర్‌రెడ్డి, ప్రసా ద్‌, పసుల వెంకటి, ఆనందరెడ్డి, తీగల పుష్పలతలతో పాటు వివిద గ్రామాల నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:41 AM