ఉచిత హెపటైటీస్ వ్యాక్సినేషన్ ప్రారంభం
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:43 PM
నేషనల్ వైరల్ హెపటైటీస్ కంట్రోల్ ప్రోగ్రాం కింద ఉచిత హెపటైటీస్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సుభాష్‌నగర్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నేషనల్ వైరల్ హెపటైటీస్ కంట్రోల్ ప్రోగ్రాం కింద ఉచిత హెపటైటీస్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం జిల్లా జనరల్ ఆసుపత్రిలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తకీయుద్దీన్, ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాజిదాఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్ నవీన, హెల్త్ ఎడ్యుకేటర్ సరస్వతి, ఇతర వైద్యాధికారులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.