నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:44 PM
కార్మికులకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటెటివ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్ డిమాండ్ చేశారు.
సుభాష్‌నగర్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటెటివ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్ డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా శాఖ ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులు, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటెటివ్స్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ కొత్త లేబర్ కోడ్‌ల వల్ల యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు ఉండదని, న్యాయమైన సమస్య పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కు కూడా కాలరాసేలా ఉన్నాయని విమర్శించారు. ఈ నెల 24 నుంచి 26 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు విద్యాసాగర్, శ్రీనివాస్, సదానందచారి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మిరుపాల అంజయ్య, ఉపాధ్యక్షుడు హరీష్, సహాయ కార్యదర్శులు నరేందర్, మదన్‌మోహనాచారి, సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.