ఘనంగా కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి జయంతి
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:30 AM
కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకట స్వామి జయంతి వేడుక లు ఘనంగా జరిగాయి.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకట స్వామి జయంతి వేడుక లు ఘనంగా జరిగాయి. ఆదివారం సిరిసిల్ల పట్టణం లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వ ర్యంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుక లను నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలతో నివాళు లర్పించారు. అనంతరం గడ్డం వెంకటస్వామి చిత్రప టానికి నాయకులు పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి వెంకటస్వామి కృషి చేశారన్నారు. ఇళ్లులేని పేద పక్షాన పోరాడి వారికి గుడిసెలు వేయిం చి ఇంటి పేరునే గుడిసెల వెంకటస్వామిగా ఖ్యాతిని సాధించారని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఈ కార్యక్ర మంలో మాజీ కౌన్సిలర్ రాగుల రాములు తదితరులు పాల్గొన్నారు.