మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దహనం
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:21 AM
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఇల్లంతకుంట, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో రసమయి బాలకిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్‌కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యనారాయణను అసభ్యంగా దూషించిన రసమయి బాలకిషన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రసమయి బాలకిషన్ వ్యవహరించిన తీరు తీవ్రంగా అభ్యంతరకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేతో పాటు కుటుంబీకులపై మాట్లాడిని తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి పదాలు వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్‌సీ డైరెక్టర్ మచ్చ రాజేశం, ఫిషరీస్ కమిటీ చైర్మన్ జెట్టి మల్లేశం, మైనార్టీసెల్ అధ్యక్షుడు జమాల్, నాయకులు కరివెద కర్ణాకర్‌రెడ్డి, జుట్టు నగేష్, సాయివర్మ, మల్లయ్య, బడుగు లింగం, బంగారి ఆంజనేయులు, లక్ష్మన్, రవి, దయాసాగర్, బాబు, సత్యం, రమేష్, శ్రీకాంత్, నర్సయ్యలతో పాటు వివిద గ్రామాల నాయకులు పాల్గొన్నారు.