Share News

కర్మను అనుసరించి ఫలితం ఉంటుంది

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:33 AM

మనిషి పాటించే కర్మలను అనుస రించి ఫలితం ఉంటుందని, మనం విషబీజం నాటితే విషపు ఫలాలే వస్తాయని, మంచి బీజం నాటితే మంచి ఫలాలు వస్తాయని శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి భక్తుల కు సూచించారు.

కర్మను అనుసరించి ఫలితం ఉంటుంది

వేములవాడ కల్చరల్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మనిషి పాటించే కర్మలను అనుస రించి ఫలితం ఉంటుందని, మనం విషబీజం నాటితే విషపు ఫలాలే వస్తాయని, మంచి బీజం నాటితే మంచి ఫలాలు వస్తాయని శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి భక్తుల కు సూచించారు. ధర్మ విజయయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి వేములవాడ క్షేత్రానికి చేరుకు న్నారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయ ఓపెన్‌ స్లాబ్‌లో భక్తులకు అనుగ్రహణభాషణం చేశారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం ఎంతో పరమపవిత్రమైనదని, మహిమాన్వితమైన క్షేత్రంగా వర్ధిల్లుతుందని అన్నారు. పరమశివుడిని భక్తులు ఎంతో విశేషంగా, సర్వశ్రేష్ఠంగా ఎంతో నమ్మకంతో కొలుస్తారని అన్నారు. భక్తుల సౌక ర్యార్థం, అభివృద్ధి కోసం శాస్ర్తోక్త విధానాలతో సంపన్నం చేసేందుకు విశేషంగా అభివృద్ది జరగా లని ఆకాంక్షించారు. పరమేశ్వర తత్వం అద్భుత మైనదని, ఈశ్వరుడ మంగళకారుడని, ప్రతి ఒక్కరి మంచికోరే తత్వమని తెలిపారు. మనం చేసే పనులతోనే మనం కర్మ ఫలాన్ని అనుభవిస్తామని అన్నారు. ఈశ్వరుడు సర్వాంతర్యామీ అని మంచి చెడులను అర్థం చేసుకునే సంకల్పం ఉండాలని సూచించారు.

ప్రణాళిక ప్రకారం రాజన్న ఆలయ అభివృద్ధి పనులు

- మంత్రి పొన్నం ప్రభాకర్‌

శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి మహా స్వామి మార్గదర్శనం మేరకు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు పక్కా ప్రణా ళికతో చేపడుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శ్రీ విధేశేఖర భారతి మహాస్వామి అనుగ్రహ భాషణం చేసేముందు పొన్నం మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి లక్ష్యం రాజన్న ఆలయ అభివృద్ది అని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్దిపై స్వామి వారు మార్గద ర్శనం చేయాలని తమ సూచనలతో ముందుకు వెళుతామని విజ్ఞప్తి చేశారు. ఆలయ అభివృద్దిలో ఎలాంటి రాజకీయాలు లేదని స్పష్టం చేశారు.

శృంగేరి పీఠాధిపతుల సూచనలతోనే..

- ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శృంగేరి పీఠా ధితుల సలహాలు, సూచనల మేరకు ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. శృంగేరి పీఠాధిపతి అనుగ్రహ భాష ణంకు ముందు ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి కృషితో ఆలయాభివృద్దికి ముందడుగు వేశామని అన్నారు.భక్తుల విశ్వాసాలు, అభిప్రాయా లు, పండితులు, ఇతర ప్రముఖుల సలహాలు, సూచనల మేరకు అభివృద్ది పనులు చేపడుతు న్నామని అన్నారు. మొదటి దశలో రే. 76 కోట్లతో ప్రధాన ఆలయ విస్తరణ, అభివృద్ది,, రూ. 35 కోట్లతో అన్నదాన సత్రం, రూ. 47 కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆయన వెంట ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఆలయ ఈవో రమాదేవి తదితరులు ఉన్నారు.

పీఠాధిపతికి ఘన స్వాగతం

వేములవాడ కల్చరల్‌ : ఽశృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయ యాత్రలో భాగంగా వేములవాడకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి పట్టణంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌, జిల్లా కలెక్టర్‌ హరిత, ఎస్పీ మహేష్‌ బి గీతె, అడిషనల్‌ ఎస్పీలు శేషాద్రి నిరెడ్డి, చంద్రయ్యలు పూలమాలలు అందజేసి ఘనస్వాగతం పలికారు. భక్తులు భారీ గజమాల సమర్పించారు. మహిళలు హారతులు పట్టారు.

Updated Date - Oct 20 , 2025 | 12:33 AM