పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:37 AM
రైతులు పాడి పరిశ్ర మ అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : రైతులు పాడి పరిశ్ర మ అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం పల్లిమక్తలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా, పశువు లకు గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ ఎం.హరితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ రైతులు వ్యవసాయంతో పాటుగా పాడి పశువుల పెంప కంపై దృష్టి సారించాలని సూచించారు. దీంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సబ్సిడీపై 200 యూనిట్ల గేదెలను రైతులకు ఇటీవల పంపిణీ చేశామని గుర్తు చేశారు. పశు సంపదను కాపాడితే రైతుకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న రైతులకు పశువులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. మధ్య మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు పాడి పరిశ్రమ కింద ఉపాధి కల్పించేందుకు ఇటీవల ఆ శాఖ మంత్రిని కలిశామని వివరించారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. సాగుకు అన్ని విధాలుగా మద్దతు గా నిలుస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగ కుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మల్కపేట రిజర్వాయర్ పనులు పూర్తి చేసి, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలకు సాగు నీరు అందించి పంటలను కాపాడామని గుర్తు చేశారు. ఈ ఏడాది రిజర్వాయర్ లో రెండు టీఎంసీల నీటిని నిలువ ఉంచామని, వచ్చే ఏడాది మూడు టీఎంసీల నీటిని నిలువ పెట్టనున్నామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాలువలు పూర్తి చేసి కోనరావుపేట మండలంలోని దాదాపు 10 గ్రామాలకు సాగునీటిని అందించామని గుర్తు చేశారు. మల్కపేట కు రూ. 12 కోట్ల బిల్లులు చెల్లించామని తెలిపారు. రుద్రంగి కలి కోట సూరమ్మ చెరువుకు రూ.75 కోట్లు మంజూరు చేయగా, పనులు వేగంగా ముందుకు వెళ్తున్నాయని విప్ వెల్లడిం చారు. నాగారానికి రోడ్డు వేయించామని, పల్లిమక్తలో రూ. కోటి 50 లక్షలతో రోడ్డు వేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ హరిత
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ ఎం హరిత పేర్కొన్నారు. కోనరావుపేట మండలంలోని పల్లిమక్త గ్రామంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరంలో కలెక్టర్ హరిత పాల్గొని మాట్లాడారు. వ్యవసాయంతో పాటుగా రైతులు అనుబంధంగా పశువులను పెంచుకోవడంతో ఆర్థికంగా మేలు చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వపరంగా అర్హులైన రైతులకు పశువులు, కోళ్లు ఇతర జీవాలను ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా ప్రభుత్వం టీకాలు పంపిణీ చేస్తుందని వెల్లడించారు. పశువుల పెంపకం దారులు తమ గ్రామాల్లో పశువైద్యాధికారులు నిర్వహించే శిబిరాలకు జీవాలను తీసుకెళ్లి టీకాలు వేయించాలని కలెక్టర్ హరిత సూచించారు. పశువులు ఉండే పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని దీంతో అవి ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. పశువుల పెంపకం దారులు ఏటా అందజేసే టీకాలను జీవాలకు వేయించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య , తహసీల్దార్, ఎంపీడీవో, కాంగ్రెస్ జిల్లా నాయకులు కేతిరెడ్డి జగన్మో హన్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాయిని ప్రభాకర్ రెడ్డి, నాయకులు కచ్చకాయల బాల్‌రెడ్డి, బొడ్డు రమేష్, నీరటి సంజీవ్, ఉప్పుల గంగయ్య, సుంకరి మహేష్, సిద్ధరేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.