Share News

వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Sep 07 , 2025 | 01:06 AM

విద్యార్థులు వ్యక్తిగత పరిశు భ్రతపై దృష్టి సారించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు.

వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలి

సిరిసిల్ల రూరల్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు వ్యక్తిగత పరిశు భ్రతపై దృష్టి సారించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలో ని చిన్నబోనాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం జిల్లా సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారితపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా సంక్షేమాధి కారి లక్ష్మీరాజం మాట్లాడుతూ మహిళల కోసం రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 01:06 AM