Share News

ప్రభుత్వ ప్రాధాన్యతలపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Jun 22 , 2025 | 12:37 AM

ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ సందీప్‌ కు మార్‌ ఝా బ్యాంకర్లను ఆదేశించారు.

ప్రభుత్వ ప్రాధాన్యతలపై దృష్టి సారించాలి

సిరిసిల్ల, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ సందీప్‌ కు మార్‌ ఝా బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం కలెక్ట రేట్‌లో బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్‌ఆర్‌ిసీ సమావేశం జరి గింది. 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక రూ 4890 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో భాగంగా 92428 మంది రైతులకు దాదాపు రూ 1700 కోట్ల పంట రుణాలు, 22525 మంది రైతులకు రూ 1006 కోట్ల వ్యవసాయ టర్మ్‌ రుణాలు, 10082 మంది రైతులకు రూ 277కోట్ల వ్యవసాయాధారిత రుణాల పం పిణీ, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ 612.30 కోట్లు లక్ష్యం గా నిర్దేశించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ 1519 కోట్ల పంట రుణ లక్ష్యానికి రూ 1093 కోట్లు, రూ 196 కోట్ల వ్యవసాయ టర్మ్‌ రుణాలకు దాదాపు రూ 554 కోట్ల రుణాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమున్న చోట నూతన బ్యాంక్‌ బ్రాంచ్‌ ప్రారంభించేందుకు అవకాశాలను పరిశీలించాలని ఆదే శించారు. 500 ఇళ్లు ఉన్న ఆవాసాల్లో 323 బ్యాంకింగ్‌ అవుట్‌లెట్‌లను ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలోని బ్యాం కులు డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. క్యూఆర్‌ కోడ్‌లేని వ్యాపారస్థులను గుర్తించి వారికి సదు పాయాల కల్పనతో బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జనధన్‌ బ్యాంక్‌ ఖాతాదారులం దరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, పీఎంజేజేబీ వై పథకాల్లో నమోదు చేసుకునేలా చూడాలని అన్నారు. పబ్లిక్‌ ఔట్‌ రీచ్‌ కార్యక్రమాల్లో వీటిపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఎం ఎస్‌ఎంఈ రంగానికి నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 59 శాతం మాత్రమే రుణాలు పంపిణీ చేశారని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్దఎత్తున చిన్న సూక్ష్మ పరిశ్రమ ల ప్రోత్సహించేలా రుణాలు మంజూరు చేయాలని, ప్ర స్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న పంట రుణ లక్ష్యాలను వంద శాతం చేరుకోవాలన్నారు. జిల్లాలో విద్య రుణాల పంపిణీ 16శాతం, ఇంటి నిర్మాణ రుణాల పంపిణీ 70శాతం మాత్రమే చేరుకోవడానికిగల కారణా లను అడిగితెలుసుకున్నారు. బ్యాంకులో అందించే వివి ధ విద్య రుణాలుపై విద్యార్థులకు అవగాహన కల్పించా లని సూచించారు. జిల్లాలో జూన్‌ 16 నాటికి 82 స్వశక్తి సంఘాలకు రూ 8.7కోట్లు, మెప్మా కింద 118 సంఘాల కు రూ 14.50 కోట్ల బ్యాంకు రుణాలు అందించామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్‌ రుణా ల పంపిణీ వేగవంతం చేయాలని, ఎంసీపీలను త్వరగా బ్యాంకులకు సమర్పించాలని తెలి పారు. యువతకు రుణాలందించా లి స్వయంఉపాధిని ప్రోత్సహించేం దుకు వివిధ పథకాల కింద యువ తకు రుణాలు అందించాలన్నారు. 2024-25సంవత్సరంలో స్టాండ్‌అప్‌ ఇండియా కింద 16 యూనిట్లకు రూ 2కోట్ల రుణాలు మంజూరు చే శామని, ముద్ర రుణాలకింద 8220 మంది లబ్ధిదారులకు రూ 101.24 కోట్ల రుణాలు పంపిణీ జరిగినట్లు, పీఎంఎఫ్‌ఎంఈ కింద 63 దరఖా స్తులను ఆమోదించామని తెలిపారు. కులవృత్తులు, చేతి వృత్తుల వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తూ ఉపాధి కల్పించే దిశగా యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వక ర్మ పథకాన్ని ప్రారంభించిందని, దీనికోసం వచ్చే ఐదు సంవత్సరాల కాలానికి రూ.13వేల కోట్లు నిధులను కేటా యించామని తెలిపారు. పీఎం విశ్వకర్మ పథకం పట్ల విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, జిల్లాలో ఇప్పటి వరకు 343 దరఖాస్తులకు నిబంధనల ప్రకారం పథకం మంజూరు చేసామన్నారు. అర్హులకు పథకం అమలుచే యాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో ఆర్‌బీఐ ప్రతినిధి వి సాయితేజ్‌రెడ్డి, నాబార్డు డీడీఎం దీలీప్‌ చం ద్రా, యూబీఐ రీజనల్‌ హెడ్‌డీ అపర్ణరెడ్డి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ టి మల్లికార్జున్‌రావు, డీఆర్‌డీవో శేషాద్రి, డీవీ హెచ్‌వో రవీందర్‌రెడ్డి జీఎండీఐసీ హనుమంతు, ఎస్‌సీ కార్పోరేషన్‌ ఈడీ స్వప్న, మున్సిపల్‌ కమిషనర్లు, బ్యాంక్‌ మేనేజర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 12:38 AM