Share News

తొలి విడత నామినేషన్లకు ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:31 AM

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తొలి విడత నామినేషన్లకు ఏర్పాట్లు

- నామినేషన కేంద్రాల ఏర్పాటు

- ఎన్నికల అధికారులు నియామకం

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విడతలో జిల్లాలోని కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పంచాయతీల్లో రాజకీయ సందడి మొదలైంది.

కరీంనగర్‌ రూరల్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండల పరిదిలో ఉన్న 14 గ్రామ పంచాయతీలకు తొలివిడతలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఐదు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చామనపల్లి, చెర్లబూత్కూర్‌, చేగుర్తి, మొగ్దుంపూర్‌, నగునూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. చామనపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో చామనపల్లితో పాటు బహదూర్‌ఖాన పేట, ఫకీర్‌ పేట గ్రామాలకు సంబందించిన అభ్యర్థులు నామినేషన దాఖలు చేయాల్సి ఉంటుంది. చెర్లబూత్కూర్‌ కేంద్రంలో తాహెర్‌ కొండాపూర్‌, దుబ్బపల్లి, చేగుర్తి కేంద్రంలో నల్లగుంటపల్లి, మొగ్దుంపూర్‌ కేంద్రంలో మందుపల్లి, ఇరుకుల్ల, నగునూర్‌ కేంద్రంలో జూబ్లీనగర్‌, ఎలబోతారం గ్రామాలకు సంబందించిన సర్పంచ వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని ఎంపీడీవో సంజీవరావు, ఎంపీవో జగన్మోహన రెడ్డి తెలిపారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలో సర్పంచ ఎన్నికల నిర్వహణలో బాగంగా బుధవారం ఎన్నికల అధికారులను నియమించారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 14 గ్రామ పంచాయతీలు 132 వార్డులు ఉన్నాయి. మండలంలో మొత్తం ఓటర్లు 22,053 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులను నియమించారు.

ఫ భగత్‌నగర్‌: గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికల నామినేషన్‌లకు కొత్తపల్లి మండలంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తపల్లి మండలంలో ఆరు గ్రామ పంచాయతీలు ఉండగా ఎలగందల్‌, ఆసిఫ్‌నగర్‌ గ్రామ పంచాయతీల్లో నామినేషన స్వీకరణ కేంద్రాలు ఉంటాయి. ఎలగందల్‌ గ్రామ పంచాయతీలో ఎలగందల్‌, ఖాజీపూర్‌, కమాన్‌పూర్‌ గ్రామాలకు సంబంధించిన నామినేషన్‌లు, ఆసిఫ్‌నగర్‌ గ్రామ పంచాయతీలో ఆసిఫ్‌నగర్‌, బద్దిపల్లి, నాగులమల్యాల గ్రామాలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారు. ఎలగందల్‌లో ప్రధానోపాధ్యాయురాలు రాజరాజేశ్వరి, ఆసిఫ్‌నగర్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ జక్కుల లక్ష్మీరాజం రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారు.

ఫ చొప్పదండి: మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉండగా నామినేషన్ల స్వీకరణకు ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆర్నకొండ గ్రామ పంచాయతీలో ఆర్నకొండ, చిట్యాలపల్లి, మంగళపల్లి గ్రామాల సర్పంచు, వార్డు సభ్యుల నామినేషన్లను స్వీకరిస్తారు. రాగంపేట గ్రామ పంచాయతీలో రాగంపేట, రేవెల్లి, పెద్దకుర్మపల్లి, దేశాయిపేట, భూపాలపట్నం గ్రామ పంచాయతీలో భూపాలపట్నం, వెదురుగట్ట, రుక్మాపూర్‌లో రుక్మాపూర్‌, చాకుంట, కొలిమికుంట గ్రామాలకు చెందిన నామినేషన్లు తీసుకుంటారు. కాట్నపల్లి గ్రామ పంచాయతీలో కాట్నపల్లి, గుమ్లాపూర్‌, కోనేరుపల్లి, సాంబయ్యపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ, వార్డు సభ్యుల నామినేషన్లను స్వీకరిస్తారు.

ఫ రామడుగు: మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా తొమ్మిది నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోలిరామయ్యపల్లి గ్రామ పంచాయతీలో కొరటపల్లి, గోలిరామయ్యపల్లి, మోతె గ్రామాలకు చెందిన సర్పంచ, వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. గోపాల్‌రావుపేటలో గోపాల్‌రావుపేట, గుండి పంచాయతీల నామినేషన్లు స్వీకరిస్తారు. కొక్కెరకుంటలో కొక్కెరకుంట, దేశరాజుపల్లి, వన్నారం గ్రామాలకు చెందిన సర్పంచ, వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. లక్ష్మీపూర్‌ పంచాయతీలో లక్ష్మీపూర్‌, వెంకట్‌రావుపల్లి, రామడుగు పంచాయతీలో రామడుగు, తిర్మలాపూర్‌, రామచంద్రాపూర్‌ పంచాయతీలో రామచంద్రాపూర్‌, చిప్పకుర్తి, శ్రీరాములపల్లి పంచాయతీల నామినేషన్లు స్వీకరిస్తారు. షానగర్‌ పంచాయతీలో షానగర్‌, పందికుంటపల్లి, కిష్టాపూర్‌, రుద్రారం పంచాయతీలో రుద్రారం, రంగసాయిపల్లి, దత్తోజీపేట, వెదిర పంచాయతీలో వెదిర, వెలిచాల గ్రామాలకు చెందిన సర్పంచ, వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.

గంగాధర: మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉండగా 11 నామినేషన కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆచంపల్లి పంచాయుతీలో ఆచంపల్లి, ఒద్యారం, చిన్నాచంపల్లి గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తారు. బూరుగుపల్లి పంచాయతీలో బూరుగుపల్లి, ముప్పిడి నర్సింహులపల్లి, లింగంపల్లి, నర్సింహులపల్లి, సర్వారెడ్డిపల్లి గ్రామాల అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. గంగాధర రైతువేదికలో లక్ష్మిదేవిపల్లి, మధురానగర్‌, మంగపేట, గంగాధర, నారాయణపూర్‌ గ్రామ పంచాయతీలో నారాయణపూర్‌, చర్లపల్లి, నాగిరెడ్డిపూర్‌ గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తారు. ర్యాలపల్లి గ్రామ పంచాయతీలో ర్యాలపల్లి, కొండయ్యపల్లి, చర్లపల్లి(ఆర్‌), కాచిరెడ్డిపల్లి పంచాయతీలో కాచిరెడ్డిపల్లి, ఇస్లాంపూర్‌, వెంకటయ్యపల్లి, కురిక్యాల గ్రామ పంచాయతీలో కురిక్యాల, కొండన్నపల్లి గ్రామాల అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఉప్పరమల్యాల పంచాయతీలో ఉప్పరమల్యాల, వెంకంపల్లి, రంగరావుపల్లి, గర్షకుర్తి పంచాయతీలో గర్షకుర్తి, తాడిజెర్రి, మల్లాపూర్‌ గ్రామ పంచాయతీలో గోపాల్‌రావుపల్లి, మల్లాపూర్‌, కాసారం, గట్టుబూత్కుర్‌ గ్రామ పంచాయతీలో హిమ్మత నగర్‌, గట్టుబూత్కుర్‌ గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తారు.

Updated Date - Nov 27 , 2025 | 01:31 AM