ప్రశాంత వాతావరణంలో మొదటి విడత ఎన్నికలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 01:30 AM
జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
చందుర్తి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేల భద్రత పరమైన పలు సూచనలు చేశారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతి యుత వాతావరణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు, ప్రత్యేక పోలీ సు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.