నేడు తుది విడత ఎన్నికలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:02 AM
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరు కున్నది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూరి ్తకాగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఆది వారం జరుగనున్నాయి.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరు కున్నది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూరి ్తకాగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఆది వారం జరుగనున్నాయి. ఇదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. దీంతో పంచాయతీ ఎన్నికలు ముగిసి అన్ని పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు అధికారం చేపట్టనున్నాయి. ఈనెల 20 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఆ రోజే సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డుసభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారు. మూడో విడతలో 111 పంచా యతీల్లో ఎన్నికలు నిర్వహిం చేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించే అధి కారులు, సిబ్బంది పోలింగ్ సామగ్రితో గ్రామాలకు చేరు కున్నారు. ఈ విడతలో 111 గ్రామ పంచాయతీల్లో సర్పం చ్ పదవులు, 1,034 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. సైదా పూర్ మండలం ఆరెపల్లి గ్రామంలో సర్పంచుతో పాటు వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
బోగంపాడ్ గ్రామ పంచాయతీలో నిర్మల సర్పం చ్‌గా, ఏడు వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఈ పంచాయతీలో ఒక వార్డు స్థానానికి పోటీ జరుగుతున్నది. వీణవంక మండలం మల్లన్న పల్లి సర్పంచ్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. వివిధ పంచాయతీల్లో 184 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 108 సర్పంచ్, 850 వార్డుసభ్యుల పదవులకు ఎన్ని కలు జరుగనున్నాయి.
ఫ 108 సర్పంచ్, 850 వార్డు సభ్యుల
పదవులకు ఎన్నికలు
ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, వీణ వంక, సైదాపూర్ మండలాల్లోని గ్రామాల్లో బుధవారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
ఫ ఇల్లందకుంట మండలంలో 18 పంచాయతీల్లో ఒక పంచాయతీలో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. బోగంపాడ్ సర్పంచుగా నిర్మల ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. 166 వార్డులు ఉండగా 34 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 17 సర్పంచ్ పదవులకు 78మంది, 132 వార్డులకు 378 మంది అభ్యర్థులు పోటీ లో ఉన్నారు. ఈ మండలంలో 26,100 మంది ఓటర్ల ఉండగా ఇందులో పురు షులు 12,761, మహిళలు 13,338, ఇతరులు ఒకరు ఉన్నారు.
ఫ హుజూరాబాద్ మండలంలో 20 పంచాయతీలు, 196 వార్డులున్నాయి. 30 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 20 సర్పం చ్ స్థానాలకు 81 మంది, 166 వార్డులకు 460 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ 18,686 మహిళలు, 17,257 పురు షులు, మొత్తం 35.943 మంది ఓటర్లు ఉన్నారు.
ఫ జమ్మికుంట మండలంలో 20 గ్రామ పంచాయతీలు, 188 వార్డులు ఉన్నాయి. 33 ఏకగ్రీవమయ్యాయి. 20 సర్పంచ్ పదవులకు 90 మంది, 155 వార్డులకు 461 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మండలంలో మొత్తం 28,929 మంది ఓటర్లు ఉండగా వారిలో 14,094 మంది పురుషులు, 14,835 మంది మహిళలున్నారు.
ఫ వీణవంక మండలంలో 26 పంచాయతీలు, 246 వార్డులు ఉన్నాయి. మల్లన్నపల్లిలో కలకొండ సరోజన సర్పంచుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 25 సర్పంచు స్థానా ల్లో 110 మంది పోటీలో ఉన్నారు. 25 వార్డులు ఏక గ్రీవం కాగా 221 వార్డు లకు 622 మంది పోటీలో ఉన్నారు. 42,659 మంది ఓటర్లు ఉండగా వారిలో 20,786 పురుషులు, 21,872 మహి ళలు, ఇతరులు ఒకరు ఉన్నారు.
ఫ సైదాపూర్ మండ లంలో 27 పంచాయతీలు
(మిగతా 8వ పేజీలో)
(5వ పేజీ తరువాయి)
ఉండగా ఆరెపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా వర్నె లావణ్య, ఎనిమిది మంది వార్డుసభ్యులు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 26 సర్పంచు స్థానాలకు 95 మంది పోటీలో ఉన్నారు. 238 వార్డులు ఉండగా 62 ఏకగ్రీవమయ్యాయి. 176 వార్డులకు 500 మంది పోటీ చేస్తున్నారు. 31,415 ఓటర్లు ఉండగా 15,292 పురుషులు, 16,122 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారు.
ఫ చివరి విడతలో ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లోని 108 సర్పంచు పదవులకు 454 మంది పోటీపడుడు తుండగా 850 వార్డులకు 2421 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడ తలో 1,65,046 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా అందులో మహిళలు 84,853, పురుషులు 80190 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు.