Share News

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:56 PM

అణగారిన వర్గాల హక్కుల కోసం వందేళ్లుగా పోరాటం చేస్తున్న పార్టీ సీపీఐ అని జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ అన్నారు.

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం
జెండాను అవిష్కరిస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌

భగత్‌నగర్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అణగారిన వర్గాల హక్కుల కోసం వందేళ్లుగా పోరాటం చేస్తున్న పార్టీ సీపీఐ అని జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ శక్తుల ఆగడాలకు కళ్లెం వేసేది కమ్యూనిస్టులే అన్నారు. సోవియట్‌ రష్యా విప్లవ విజయం స్పూర్తితో భారతదేశానికి స్వాతంత్ర్యానికి పూర్వమే 1925 డిసెంబర్‌ 26న ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌లో సీపీఐ ఆవిర్భవించిందన్నారు. అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం వర్గ దోపిడీకి వ్యతిరేకంగా సీపీఐ పనిచేస్తుందన్నారు. దేశంలో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, 18 ఏళ్లు నిండిన యువకులకు ఓటు హక్కు చట్టం, భూ హక్కు చట్టం అటవీ హక్కుల చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం వంటి అనేక ప్రజా ఉపయోగకరమైన చట్టాలు తీసుకువచ్చిన గనత సీపీఐదే అన్నారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం నవాబ్‌కు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సీపీఐ నాయకులు పిలుపునిచ్చారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కు లను కాలరాస్తుందన్నారు. దేశ సంపదను పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్‌, మాండ్లపల్లి యుగేందర్‌, బూడిద సదాశివ, కొట్టె అంజలి, భారతి, సత్యం, టి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 11:56 PM