Share News

ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్లు పూర్తి..

ABN , Publish Date - Jun 26 , 2025 | 12:17 AM

దేశంలో ఇందిరాగాంధీ నియంత పాలనలో విధించిన ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాలు పూర్తి అయ్యాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు.

ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్లు పూర్తి..

సిరిసిల్ల రూరల్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : దేశంలో ఇందిరాగాంధీ నియంత పాలనలో విధించిన ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాలు పూర్తి అయ్యాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో బుధవారం ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా అంబే ద్కర్‌చౌరస్తా నుంచి నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని గాంధీ విగ్రహం వరకు మౌన నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్‌లతో పాటు ఎమర్జెన్సీ సమ యంలో జైలు జీవితం అనుభవించిన ప్రభాకర్‌రావు, కస్తూరి గాల్‌రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ 1975లో ఇందిరాగాంధీ పాలనలో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ ఎమర్జెన్సీ దినంను గత యాభై సంవత్సరాలు జరుపుకుం టున్నామన్నారు. 1975నుంచి 1977వరకు 21నెలల పాటు ఇందిరాగాం ధీ పాలనలో అత్యవసర పరిస్థితిని విధించి ఆ సమయంలో పౌరుల ప్రాథమిక హక్కులను, స్వేఛ్చలను ప్రభుత్వం హరించిందనారు. ఎమ ర్జెన్సీకి వ్యతిరేకంగా ఆ కాలంలో జరిగిన అక్రమాలు, అణచివేతలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో భావ ప్ర కటన స్వేఛ్చ ప్రాముఖ్యతలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్‌, అల్లాడి రమేష్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యలు మ్యానయ రాంప్రసాద్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కు దేవేందర్‌యాదవ్‌, కరీంనగర్‌ పార్లమెం టరీ కో-కన్వీనర్‌ అడెపు రవీందర్‌, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి మాల్లారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, ఓబీసీమోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేష్‌, మహిళా మోర్చా జిల్లా అధ్య క్షురాలు పల్లం అన్నపూర్ణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాం త్‌, జిల్లా అధికార ప్రతినిధి నవీన్‌యాదవ్‌, బంధారపు కృష్ణరెడ్డి, ప్రసా ద్‌రెడ్డి, దేవసాని కృష్ణ, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ నాగుల శ్రీనివాస్‌, వెంక టేశ్వర్‌రావు, అంజాగౌడ్‌, జూకంటి అఖిల్‌, మహిళా మోర్చా జిల్లా ప్ర ధానకార్యదర్శి కర్నే హరీష, పండుగ మాధవి, పట్టణ అధ్యక్షురాలు వేముల వైశాలి, మండలాల అధ్యక్షులు వేణుగోపాల్‌, బుర్ర శేఖర్‌గౌడ్‌, మిరాల్‌కార్‌ బాలాజీ, రామచంద్రరెడ్డి, సౌల క్రాంతి, కోడి రమేష్‌, మోకి లే విజయేందర్‌, పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 12:17 AM