Share News

ఎరువుల విక్రయాల వివరాలను నమోదు చేయాలి

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:29 AM

జిల్లాలో సాగుకు సరిపడా ఎరు వులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవస రం లేదని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

ఎరువుల విక్రయాల వివరాలను నమోదు చేయాలి

ఎల్లారెడ్డిపేట, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగుకు సరిపడా ఎరు వులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవస రం లేదని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. ఎరువుల దుకాణాదారులు విధిగా అమ్మకాలకు సంబంధించిన వివరాలను ఈ పాస్‌ యంత్రంలో నమోదు చేయాలని సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని ఎరు వుల దుకాణాన్ని మంగళవారం ఆమె ఆకస్మీకంగా తనిఖీ చేశారు. దుకాణంలోని ఎరువుల నిల్వ, విక్రయాలు, బిల్లులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అమ్మకాలు, నిల్వల వివరాలను ఈ పాస్‌ యంత్రం ద్వారా నిర్వహించాలని సూచించారు. వ్యతాసం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కృత్తిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. రైతులకు సకాలంలో ఎరు వులను అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. ఆమె వెంట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌భేగం, ఏవో రాజశేఖర్‌ ఉన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 12:29 AM