ఫర్టిలైజర్ యాప్, ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:24 AM
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్ యాప్‌తో పాటు ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహ న కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులు, ఫర్టిలైజర్ ఏజెన్సీల నిర్వాహకులను ఆదేశించారు.
సిరిసిల్ల రూరల్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్ యాప్‌తో పాటు ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహ న కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులు, ఫర్టిలైజర్ ఏజెన్సీల నిర్వాహకులను ఆదేశించారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని చంద్రంపేట జిల్లా రైతు వేది కలో గురువారం ఫర్టిలైజర్ యాప్, అయిల్‌పామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాల సాధనపై వ్యవ సాయాధికారులు, ఐకేపీ ఫర్టిలైజర్ ఏజెన్సీల డీలర్లు, సింగిల్‌విండోల కార్యదర్శులకు శిక్షణ అవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్‌తో ఉపయోగాలను రైతులకు వివరించాలని పేర్కొ న్నారు. యాప్ వినియోగంతో రైతులకు ఎరువుల వివరాలు, ఎక్కడ అందుబాటులో ఉందో అనే సమాచారం తెలుస్తుందని, వారికి కేటాయించిన ఎరువులు అందుబాటులో ఉంటాయనే వివరాలు తెలుపాలని సూచించారు. ఎక్కడి నుంచి అయినా రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం వివరాలతో లాగిన్ అయితే వారికి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఫర్టిలైజర్ దుకాణాల యజమానులతో పాటు డీలరులు ఈ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు ఒకరిని నియమిం చాలని, వారు రైతులకు యాప్‌లో బుకింగ్‌పై సహాయం చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరగడం వల్ల రైతులకు అధిక లాభం జరగడంతో పాటు దేశానికి కూడా మేలు చేకూరుతుందని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుకు ఆసక్తిగా ఉన్న రైతుల వివరాలు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, ఉద్యా నవన శాఖ అధికారి శరత్‌బాబు, ఏవో, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.