ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:14 AM
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
గణేశ్‌నగర్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. ఇప్పటికే పైవ్రేట్ డిగ్రీ, వృత్తి విద్య కళాశాలల యాజమాన్యాలు రెండుసార్లు సమ్మెకు వెళ్లాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేకపోతే రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి యోగేష్, బామండ్ల నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విగ్నేష్, వంశీ, విష్ణు, ప్రదీప్, అజయ్, సాయి, నిఖిల్, విగ్నేష్, ప్రశాంత్, ఆకాష్, మురళి, రాజేష్, సాయి కృష్ణ పాల్గొన్నారు.