ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయాలి
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:06 AM
పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే విడుదలచేయాలని డి మాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం పాత బస్టాండ్‌లో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే విడుదలచేయాలని డి మాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం పాత బస్టాండ్‌లో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐ ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్, కార్యదర్శి మంద అనిల్‌కుమార్ మా ట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యారంగానికి ఇచ్చిన హామీలను గాలికొదిలేసిం దని ఆరోపించారు. దాదాపు రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాల ర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉండడం వల్ల విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందు లకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు తెలం గాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అదే దిశగా నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి విద్యార్థులను బలిదానాన్ని కోరుకుందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి విద్యార్థుల సమస్య లను విస్మరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా, దీపావళి పండుగ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ రూ.600 కోట్లు విడుదల చేస్తామని మాయమాటలు చెప్పిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాల ర్‌షిప్ మొత్తంను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చిన ఏఐఎస్‌ఎఫ్ అండగా ముందుంటుందన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెల ఆదిత్య, నాయకులు శశికుమార్, బట్టి హరికృష్ణ, రాహుల్, సంపత్, శ్రీకాంత్, సన్నీ పాల్గొన్నారు.