Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ విడుదల చేయాలి

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:23 AM

ఫీజురీయిం బర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకా యిలను వెంటనే విడదల చే యాలని డిమాండ్‌ చేస్తూ ఏబీ వీపీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ విడుదల చేయాలి

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఫీజురీయిం బర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకా యిలను వెంటనే విడదల చే యాలని డిమాండ్‌ చేస్తూ ఏబీ వీపీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ రాజురావు మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ రాకపోవడం వల్ల పేద బడుగుబలహీన వర్గాలకు చెందిన విద్యా ర్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యా ర్థులకు మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నా రన్నారు. కొన్ని పాఠశాలలు శిథిలావస్థకు వచ్చాయని విద్యార్థులు భయంభయంగా విద్యను అభ్యసిస్తున్నా రన్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు ప్రభుత్వం పక్క భవనాలను కట్టించా లని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుం టామని హెచ్చరించారు.ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల ను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని డి మాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ముట్టడికి ఏబీ వీపీ నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకు న్నారు. దీంతో పోలీసులు, ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:23 AM