వేగంగా ధాన్యం కొనుగోళ్లు..
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:00 AM
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతు న్నాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతు న్నాయి. గతేడాది వానాకాలం సీజన్ కంటే ఈ ఏడాది అధికంగా ధాన్యం కొనుగోళ్లు చేశారు. వరి కోతల సమ యంలో మొంథా తుఫాన్ ప్రభావం జిల్లాపై కూడా పడింది. జిల్లాలో కురిసిన వర్షాల వల్ల చాలా గ్రామాల్లో వరి పంట నేల వాలి రైతులకు నష్టం వాటిల్లింది. ఆ తర్వాత కూడా తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ, వర్షాలు పడ లేదు. కోసిన ధాన్యం ఆరబెట్టడానికి రైతులు ఇబ్బం దులు పడ్డారు. నిర్ణీత తేమ 17 శాతం వచ్చే వరకు రైతులు ధాన్యాన్ని ఆరబోశారు. తేమ శాతం వచ్చినవి వచ్చినట్లే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యాన్ని కొనుగోలు చేసి కేటాయించిన రైస్‌మిల్లులకు తరలిం చారు. నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన 48 గంటల్లోనే డబ్బులు జమ అవుతున్నాయని రైతులు తెలిపారు.
జిల్లాలో వానాకాలం సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ మేరకు గత నెలలో ధాన్యం కొనుగోళ్లను చేపట్టారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 333 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ ద్వారా 65, ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘాల ద్వారా 265 కేంద్రాలు, హాకా ద్వారా 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2 లక్షల 10 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 85 శాతానికి పైగా సన్న రకాలు సాగు చేయడం గమనార్హం. గురు వారం నాటికి జిల్లా వ్యాప్తంగా 581 కోట్ల రూపాయల విలువైన 2,43,242 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, సన్న రకం 2,12,559.37 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 30,682.98 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే రోజుకు 1,96,080 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ యేడు గత ఏడాది కంటే ఇప్పటి వరకు అదనంగా 47,162 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణు, అధికారులు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో వరి కోతలు 85 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కానున్నాయి.
ఫ సన్నాలే అధికం..
సన్న రకం ధాన్యం పంటను సాగు చేసే రైతులకు ప్రభుత్వం గత ఏడాది వానాకాలం సీజన్ నుంచి బోనస్ ఇస్తుండడంతో జిల్లాలో మెజారిటీ రైతులు సన్న రకం వరి పంటను సాగు చేశారు. క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తున్నారు. తమ అవసరా లకు పోనూ మిగిలిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యంలో సన్నరకం 2,12,559.37 మెట్రిక్ టన్నులు 87.39 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. క్వింటాల్‌కు 500 రూపాయల చొప్పున 106 కోట్ల 27 లక్షల 95 వేల రూపాయల బోనస్ రైతులు పొందను న్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్ డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోగా, ఈ సీజన్‌కు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. బోనస్ వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
- ముప్పిడి శ్రీకాంత్, డీఎం సివిల్ సప్లయి
ఎలాంటి కోతలు, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతులకు నష్టం వాటిల్లకుండా నిర్ణీత తేమ శాతం రాగానే ధాన్యం కాంటా పెట్టి తక్ పట్టీలు అందజేశాం. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాం. ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాగానే 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లాలో రైతులు సన్న రకాలు ఎక్కువగా సాగు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు లోపే కొనుగోళ్లు పూర్తి కానున్నాయి. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.