Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:06 AM

రైతు సంక్షేమమే కాం గ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

బోయినపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) రైతు సంక్షేమమే కాం గ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయిన పల్లి వ్యవసాయమార్కెట్‌ యార్డులో ఆధునిక వస తుల కల్పన కోసం లక్షల నిధులతో చేపట్టే అభివృ ద్ధి పనులకు శిలాఫలకాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభు త్వం రైతుల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తుందన్నారు. రైతు సంక్షేమ ధ్యేయంగా కాం గ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందని, రైతులకు ఆధు నిక వసతుతో మార్కెట్‌ యార్డులో పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ముందు గంటి సురేందర్‌ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ బోయినీ ఎల్లేష్‌ యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ నిమ్మ వినోద్‌రెడ్డి, సింగల్‌ విండో చైర్మన్‌ దుర్గారెడ్డి, తహసీల్దార్‌ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఏపీవో ప్రణీత, ఎంపీవో శ్రీధర్‌, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వన్నె ల రమణారెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు మహే శ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, సంభ లక్ష్మీరాజం, ఏనుగుల కనకయ్య, నాగుల వంశీ, ఏమిరెడ్డి సురేందర్‌రెడ్డి, జోగు రవీందర్‌, జంగం అంజయ్య, కొమ్మనబోయిన సువిన్‌యా దవ్‌, జంగ సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 12:06 AM