యూరియా కోసం రైతుల తంటాలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:34 AM
మండలంలో యూరి యా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు.
గంభీరావుపేట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : మండలంలో యూరి యా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళవారం యూరియా కోసం క్యూ కట్టిన ఓ రైతు ఫిట్స్‌తో సొమ్మసిల్లిపోయాడు. సింగిల్‌విండో వద్ద యూరియా కోసం మంగళవారం వేకువ జామున్నే రైతులు క్యూ కట్టారు. మండల కేంద్రానికి చెందిన పెండల మల్లయ్య అనే రైతు క్యూ లైన్‌లో గంటల తరబడి నిల్చుండటంతో ఫిట్స్‌వచ్చి కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న రైతులు ప్రథమ చికిత్స చేయించి, మల్లయ్య కుటుంబ స భ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.
ఇల్లంతకుంట : మండలకేంద్రంలోని ఎరువుల విక్రయకేంద్రాల ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. ప్యాక్స్, మహిళా సంఘూల ఆధ్వర్యంలోని విక్రయకేంద్రాలకు యూరియా రాగా రైతులకు టోకెన్లు ఇచ్చారు. మంగళవారం తెల్లవారక ముందే రైతులు, మహిళలు వచ్చి విక్రయకేంద్రం వద్ద నిరీక్షించారు. టోకెన్లు ఎక్కువగా ఇవ్వడం, యూరియా బస్తాలు తక్కువగా ఉండటంతో రైతులు వరుసలో నిలబడటానికి పోటీపడ్డారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి వరుసలో ఉంచారు. ప్యాక్స్ కేంద్రం వద్దసైతం ఇదే పరిస్థితి కనపించింది.
ముస్తాబాద్ : మండల కేంద్రంలోని రాజీవ్ కూడలిలో సీపీఐ నా యకులు మంగళవారం యూరియా కోసం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు, మంత్రి చంద్ర న్న, మిద్దె నర్సన్న, అనమేని భూదన్న, నీరెడ్డి బాలన్న, చీకోటి రాజు, గీస దేవయ్య, కుర్ర మహేశ్, రజాక్, కరీం, రాగం రాజు, అనవేని పర్శరాము లు, శ్రీనివాస్, పాక నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.
రుద్రంగి : మండల కేంద్రంలో కోరుట్ల వేములవాడ ప్రధాన కార్య దర్శి యూరియా కోసం బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, మాజీ ఎంపీపీ గంగం స్వ రూపరాణి, దయ్యాల కమలాకర్, మహేష్, మంచె రాజేశం, కంటె రెడ్డి, ఆకుల భూమక్క, చెప్యాల గణేష్, మాడిశెట్టి ఆనందం, దుబ్బ రవి, కాదా సు లక్ష్మణ్, ఉప్పులూటి గణేష్, కొడగంటి శ్యామ్, తలారి నర్సయ్య, గెంటే ప్రశాంత్, పెద్దులు తదితరులు పాల్గొన్నారు.