Share News

రైతులకు ఉత్తమ సేవలందించాలి..

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:58 AM

జిల్లాలోని ఏవో లు, ఏఈవోలు నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ ఉత్త మ సేవలు అందించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదే శించారు.

రైతులకు ఉత్తమ సేవలందించాలి..

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏవో లు, ఏఈవోలు నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ ఉత్త మ సేవలు అందించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదే శించారు. ధాన్యం సేకరణ, తేమశాతం గుర్తింపు, టోకెన్ల పంపి ణీ, క్రాప్‌బుకింగ్‌, మట్టి నమూనాల సేకరణ, విత్తనాల సేకరణ రైతు బీమా పీఎం కిసాన్‌ తదితర అంశాలపై జిల్లాలోని ఏవో లు, ఏఈవోలతో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ బుధవారం సమీక్ష సమా వేశం, శిక్షణ అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు పంట కోతలు పూర్తి అయిన రైతులకు టోకెన్లు అందజేయాలని, దానికి అనుగుణంగా ధాన్యాన్ని తేమ శాతం గుర్తించి కొనుగో లు చేయాలని ఆదేశించారు. పక్కా ప్రణాళిక ప్రకారం పనులు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని వ్యవసాయ అధికారులు రైతులకు తమతమ పరిధిలోని రైతు వేదికలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, రైతులకు సాగులో వస్తున్న ఆధునిక పద్ధ తులు, మెలకువలు ఉత్పత్తి పెంచే సలహాలు సూచనలు అందించాల ని సూచించారు. మట్టి నమూనాల సేకరణ, విత్తనాల ఎంపిక తదితర అంశాలపై తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశించారు. రూ.2500 విలువైన ఎరువుల బస్తాలు ప్రభుత్వం సబ్సిడీ పై 266 రూపాయలకు అందజేస్తుందని తెలిపారు. రైతులు కూడా ఒక ఎకరాకు రెండు బస్తాల యూరియా వినియోగిస్తే సరిపోతుందని తెలి పారు. ఎక్కువ మోతాదులో ఎరువులు వేస్తే పంట, అలాగే నేలకు కూడా ఇబ్బందులు వస్తాయని రానురాను నేల నిస్సారమవుతుందని వివరించారు. అధికారుల సూచనల మేరకు ఎరువులు పురుగు మం దులు వాడాలని స్పష్టం చేశారు. రైతులు తమకు ఉన్న నీటి వనరుల అంచనాతో పంటలు సాగు చేసుకోవాలని తెలిపారు. ఒకే పంటలు ఎప్పుడూ వేయకుండా మార్పిడి చేయాలన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌, మేలో వడగళ్ల, అకాలవర్షాలతో రైతులు నష్టపోతున్నారని దీనిని నివా రించేందుకు రైతులు 10 నుంచి 15 రోజుల ముందే రబీ (యాసంగి) సాగు పనులు మొదలుపెట్టాలని తెలిపారు. జిల్లాలో రబీ (యాసంగి)లో మొత్తం లక్ష 81వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారని వెల్లడించారు. దీనిలో 99 శాతం వరి సాగు చేశారని తెలిపా రు. 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న, మూడు వేల ఎకరాలు మిర్చి కూర గాయలు సాగు చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవ సాయ అధికారి అఫ్జల్‌ బేగం, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ మల్లికార్జునరావు, జిల్లాలోని ఏవోలు, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:58 AM