Share News

రైతులకు సరిపడా యూరియాను అందించాలి

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:33 PM

జిల్లాలో ఉన్న రైతులందరికి సరిపోయే యూరియాను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ డిమాండ్‌ చేశారు.

రైతులకు సరిపడా యూరియాను అందించాలి

సిరిసిల్ల రూరల్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉన్న రైతులందరికి సరిపోయే యూరియాను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌ లోని అమృత్‌లాల్‌శుక్లా కార్మిక భవనంలో గురువారం ఏర్పాటుచే సిన సమావేశంలో రమేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు లకు యూరియాను తగ్గించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. జిల్లాలోని రైతులకు వర్షాలకాలనికి సరిపడి యూరియాను అం దించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలోని సహకార సంఘ గోదాముల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలు కట్టి యూరియా బస్తాల కోసం నిలుచున్న వారి భాధలను పట్టిం చుకునే వారే లేకుండాపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం జిల్లాలలో యూరియా కొరత లేని రైతులు అందోళనలు చెందవద్దని ప్రకటన లు చేస్తున్నారన్నారు. అలాగే ప్రైవేటు వ్యాపారులు కూడా ఇదే అదు నుగా భావించి ఒక యూరియా బస్తా రూ 310 నుంచి రూ.350 వరకు అమ్మూతూ యూరియాతోపాటు మిగతా ఫర్టిలైజర్‌లను కొను గోలు చేస్తేనే యూరియాను ఇస్తామని అవసరం లేకున్న దంటు గోళీలు గడ్డి మందు తదితర ఫర్టిలైజర్‌ మందులను అంటగడుతు న్నారని వారిపై వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గతంలో ప్రతి సహకార సంఘ గోదాంలల్లో నిల్వ ఉండే యూరియా బస్తాలు కనిపించడం లేదన్నా రు. యూరియా బస్తాల కేటాయింపుల్లో కూడా పెద్ద రైతులు భూ స్వాములు లైన్‌లో ఎక్కడ కనిపించడం లేదన్నారు. వారికి యూరి యా ఎక్కడినుంచి అందిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటి కైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించి సీజన్‌కు సరిపడా యూ రియాను అందించాలని లేకుంటే సీపీఎం అధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో అందోళనలు ధర్నాలు చేపడుతామన్నారు. ఈ సమావేశం లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, విమల పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:33 PM