రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ABN , Publish Date - May 01 , 2025 | 12:37 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూ చించారు.
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
ధర్మారం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూ చించారు. బుధవారం ధర్మారం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మండలంలోని దొంగతుర్తి, ఖిలావనపర్తి, శాయంపేట, నందిమేడారం గ్రామాల్లోని ధాన్యం కొనుగో లు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైసు మిల్లులకు తరలించాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రా ల్లో ఎక్కడా రైతులకు ఇంబ్బందులు కలగకుండా చూడా లని పేర్కొన్నారు. ఖిలావనపర్తిలోని పల్లె దవాఖానతో పాటు మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పైలెట్ ప్రాజెక్ట్ క్రింద బంజేరుపల్లి గ్రామంలో నిర్మిస్తున్న 71 ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట హౌజింగ్ పీడీ రాజేశ్వర్, తహసీల్దార్ ఎండీ వకీల్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఉన్నారు.