ఆయిల్‌పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలి
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:52 AM
జిల్లా లో ఆయిల్‌పామ్ పంట సాగు విస్తరణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు పంట సాగుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికా రులను ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లా లో ఆయిల్‌పామ్ పంట సాగు విస్తరణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు పంట సాగుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికా రులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరే ట్‌లో శుక్రవారం ఆయిల్‌పామ్ పంటల సాగు, లక్ష్యాల సాధనపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశా న్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలె క్టర్ మాట్లాడుతూ మన దేశ అవసరాలకు సరిపడా వంట నూనె మన దగ్గర పండటం లేదని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. దీనివల్ల దేశానికి కోట్లలో నష్టం వస్తోందన్నారు. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరగడం వల్ల రైతులకు అధిక లాభం జరగడంతో పాటు దేశానికి కూడా ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఆయిల్‌పామ్ పంట సాగు విస్తరణ కోసం ప్రభుత్వం అనేక సబ్సిడీలను అందిస్తోందని, రైతులకు అంతర్ పంటల ద్వారా మొదటి మూడు సంవత్సరాలు ఆదాయం లభిస్తుంద న్నారు. మొక్కలు, డ్రిప్ అంతర్ పంటలపై నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం దాదాపు ఎకరానికి రూ.52వేలు సబ్సీడీ విడుదల చేస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరా నికి 2వేల ఎకరాలలో ఆయిల్‌పామ్ పంట సాగు విస్తీరణ లక్ష్యం కాగా ఇప్పటివరకు 1135 ఎకరాల గల 322 మంది రైతులు అయిల్‌పామ్ పంటల సాగుకు ఆసక్తి చూపించారని, 99 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు ఆసక్తిగా ఉన్న రైతు ల రిజిస్ర్టేషన్ పరిపాలన మంజూరు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాల న్నారు. ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ వేగవంతం చేయాలని కలెక్టర్ అధికా రులకు సూచించారు. ఆయిల్‌పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్న రైతు ల వద్ద నుంచి మొక్కలు, డ్రిప్ ఏర్పాటుకు రైతుల వాటా డీడీలను సేకరించి సంబంధిత ఏజెన్సీల ద్వారా డ్రిప్ సౌకర్యం సత్వరమే అందే లా చూడాలని నిర్ధేశిత లక్ష్యం ప్రకారం ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలని వివరించారు. 2022 సంవత్సరంలో బోయిన్‌పల్లి, ఇల్లంత కుంట, ముస్తాబాద్, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండలాల్లో 292 మంది రైతులు 978 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంటలను సాగు చేయగా, ఈ సంవత్సరం 450 టన్నుల వరకు ఆయిల్‌పామ్ గెలలు రావచ్చని అన్నారు. ఇప్పటి వరకు 14 టన్నుల హార్వెస్టింగ్ చేశారని, టన్నుకు రూ.18వేల ధర లభించిందన్నారు. పంట దిగుబడి వస్తున్న రైతుల అనుభవాలను కొత్త రైతులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. లాభసాటి ఆయిల్‌పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పిం చాలని అన్నారు. ఆయిల్‌పామ్ పంటలకు సంబంధించి రైతులు సల హాలు, సూచనల కోసం టోల్ ఫ్రీ నంబర్ 9398684240 ఫోన్ చేయా లని కోరారు. పంటల లాభంపై అధిక ప్రచారం కల్పించాలని అధికారు లను ఆదేశించారు. ఈసమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి లత, అధికారులు గోవర్ధన్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.