Share News

భారీ వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:11 AM

మొంథా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలి

కరీంనగర్‌ అర్బన్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. తుఫాన్‌ ప్రభావం తగ్గే వరకు వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే అన్‌లోడ్‌ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఫ రైతులను ఆదుకోవాలి

భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని, రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చొప్పదండి ఎమ్మెల్యేతో కలిసి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని కోరారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో ఆయనతో బుధవారం భేటీ అయ్యారు. అధికారులతో నష్టాన్ని అంచనావేసి రైతులకు సహకారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచన మేరకు కరీంనగర్‌, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలపై ఆయా జిల్లాల కలెక్టర్‌లు పమేలా సత్పతి, హైమవతి, స్నేహ శబరిష్‌తో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

Updated Date - Oct 30 , 2025 | 12:11 AM