రైతులకు తీరని యూరియా కష్టాలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:15 AM
సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి సొసైటీకి శనివారం యూరియా వస్తుందనే సమాచారం మేరకు రైతులు గోదాం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రైతులు రోడ్డు వరకు క్యూ కట్టారు. కొంత సేపటి తరువాత 450 బస్తాల యూరియా రావడంతో సొసైటీ సిబ్బంది, వ్యవసాయాధికారులు ఒకొక్కరికి ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు.
సైదాపూర్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి సొసైటీకి శనివారం యూరియా వస్తుందనే సమాచారం మేరకు రైతులు గోదాం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రైతులు రోడ్డు వరకు క్యూ కట్టారు. కొంత సేపటి తరువాత 450 బస్తాల యూరియా రావడంతో సొసైటీ సిబ్బంది, వ్యవసాయాధికారులు ఒకొక్కరికి ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. దాంతో లైన్లో చివరి రైతులకు యూరియా అందలేదు. పంపిణీ వద్ద ఎలాంటి గొడువలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా యూరియా కొరత తీరేదెప్పుడు, రైతుల కష్టాలు ఆగేదెఫ్పుడు అని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఫ శంకరపట్నం: శంకరపట్నం మండలంలోని మెట్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని లింగాపూర్ సొసైటీ గోదాంకు శనివారం 450 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సొసైటీ సిబ్బంది అంతకుముందు యూరియా కోసం రైతుల జాబితా తయారు చేశారు. జాబితాలో పేరు ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చారు. లిస్టులో పేరు లేని రైతులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరుసటి లోడులో వారికి ఇస్తామని సిబ్బంది హామీ ఇచ్చారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు చొప్పున పంపిణీ చేశారు.