యూరియా కోసం రైతుల తిప్పలు..
ABN , Publish Date - Sep 07 , 2025 | 01:03 AM
యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి.
ఇల్లంతకుంట, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి) : యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం మండలంలోని పలు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల విక్రయకేంద్రాలు తెరువకముందే పిల్లపాపలతో కేంద్రం వద్దకు చేరుకుంటున్నారు. మండలకేంద్రంలోని మహిళా సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న విక్రయకేంద్రానికి చేరుకున్న రైతులు నిలబడే ఓపికలేకపోవడంతో వరుసలలో చెప్పులు, బండరాయిలు ఉంచారు. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం రైతులు ఆందోళన చెందవద్దని, సరిపడా యూరియా అందుబాటులోకి వస్తుందని పేర్కొంటున్నారు.