రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:36 AM
వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరపాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు.
- కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరపాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం వానాకాలం ధాన్యం కొనుగోళ్లు అంశంపై సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆడిటోరియంలో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కేంద్రాల్లో అన్ని వసతులు పక్కాగా ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అయిందని, సుమారు 7.50 లక్షల నుంచి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలుకు వస్తుందన్న అంచనా ఉందన్నారు. గ్రేడ్ - ఏ ధర 2,389 రూపాయలు కాగా బోనస్‌గా క్వింటాలుకు 500 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. సాధారణ రకం వరి ధాన్యానికి 2,369 రూపాయల మద్దతు ధర ఉందన్నారు. జిల్లాలో 421 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, డీఆర్‌డీవో రఘువరన్, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, సివిల్ సప్లయి డీఎం జితేంద్రప్రసాద్, మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాశ్, సహకార శాఖ అధికారి మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.