Share News

ఉద్యాన పంటల సాగుతో రైతులకు లాభాలు

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:31 AM

ఉద్యాన పంటల సాగుతో రైతులకు మంచి లాభాలు వస్తాయని ఉద్యాన శాఖ జిల్లా అధికారి పల్లె కమలాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చొప్పదండిలో ఉద్యానశాఖ పథకాలపై జరిగిన రైతు అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

ఉద్యాన పంటల సాగుతో రైతులకు లాభాలు

చొప్పదండి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఉద్యాన పంటల సాగుతో రైతులకు మంచి లాభాలు వస్తాయని ఉద్యాన శాఖ జిల్లా అధికారి పల్లె కమలాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చొప్పదండిలో ఉద్యానశాఖ పథకాలపై జరిగిన రైతు అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగు, యాంత్రిక పరికరాలకు, సూక్ష్మ నీటి సేద్యానికి, ఆయిల్‌ పాం సాగుకు నగదు రూపంలో రాయితీలు ఇచ్చి ప్రోత్సహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొత్తూరి మహేశ్‌, మండల వ్యవసాయాధికారి వంశీకృష్ణ, చొప్పదండి డివిజన్‌ ఉద్యాన అధికారి రోహిత్‌ చింతల, మండల ఏఈవోలు, ఫీల్డ్‌ ఆఫీసర్‌ వంశీ పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:31 AM