Share News

అన్నదాతలకు ‘రైతు భరోసా’

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:46 AM

జగిత్యాల, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలకు సాగు ఖర్చుల నిమిత్తం రైతు భరోసా పథకం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో ఈనెల 17వ తేదీన 1,79,820 మంది రైతుల ఖాతాల్లో రూ.120,67,49,510 జమ అయ్యాయి. వానాకాలం సాగుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

అన్నదాతలకు ‘రైతు భరోసా’

-వానాకాలం సాగుకు పెట్టుబడి సాయం

-జిల్లాలో 2,48,550 మంది రైతులు

-రూ.251,14,13,131 నిధులు

-ఈనెల 25 వరకు విడతల వారీగా జమ

జగిత్యాల, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలకు సాగు ఖర్చుల నిమిత్తం రైతు భరోసా పథకం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో ఈనెల 17వ తేదీన 1,79,820 మంది రైతుల ఖాతాల్లో రూ.120,67,49,510 జమ అయ్యాయి. వానాకాలం సాగుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కొత్తగా పట్టదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు సైతం రైతు భరోసా అందించేందుకు సంబంధిత అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలో 2,48,550 మంది రైతులకు గాను రూ.251,14,13,131 పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా అందించనున్నారు. ఇది వరకు ఎకరా, రెండెకరాలు, మూడెకరాలు, ఆ తర్వాత నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతులకు ద శల వారీగా నెల రోజుల పాటు రైతు భరోసా జమ అయ్యేది. కానీ ప్రస్తుతం అలాంటి నిబంధనలేమీ లేకుండా రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఫ ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ

చిన్న, సన్నకారు రైతులకు పంట సాగు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అందిస్తున్న విషయం తెలిసిందే. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఏడాదికి ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరాకు రెండు విడతలుగా రూ.12 వేలు అందిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం వానాకాలానికి సంబంధించి రెండు రోజుల నుంచి జూన్‌ 25 వరకు విడతల వారీగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేస్తున్నారు. కొత్తగా అర్హత పొందిన రైతుల పేర్లను రైతు భరోసా జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. వారికి ఈ నెలఖారులోగా నిధులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఫ అందరికా...కొందరికా అన్న చర్చలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం గత యాసంగిలో నాలుగు ఎకరాల్లోపు వారికే రైతు భరోసా జమ చేసింది. దీంతో సుమారు 30 శాతం మంది రైతులు పెట్టుబడి సాయానికి దూరం అయ్యారు. ఈసారి వానాకాలంలోనైనా అందరికీ జమ చేస్తుందా లేక

--------------------------------------------------------------------

మండలం...రైతులు...పెట్టుబడి సాయం (రూ.లలో)

--------------------------------------------------------------------

బుగ్గారం - 7,331 - 6,85,26,365

ధర్మపురి - 16,772 - 15,17,37,981

ఎండపల్లి - 10,592 - 9,08,52,371

గొల్లపల్లి - 17,405 - 16,91,21,133

పెగడపల్లి - 14,804 - 14,20,38,927

వెల్గటూరు - 10,551 - 9,35,52,447

బీర్‌పూర్‌ - 8,415 - 8,28,71,331

బీమారం - 6,314 - 8,70,43,596

జగిత్యాల - 6,026 - 2,98,79,183

జగిత్యాల రూరల్‌-18,135 - 15,94,92,147

కొడిమ్యాల - 13,224 - 13,59,81,352

మల్యాల - 12,239 - 11,96,19,396

మేడిపల్లి - 9,041 - 10,85,81,394

సారంగపూర్‌ - 7,970 - 7,71,12,465

ఇబ్రహీంపట్నం- 11,375 - 13,43,56,001

కథలాపూర్‌ - 13,939 - 16,60,78,141

కోరుట్ల - 14,258 - 14,32,36,049

మల్లాపూర్‌ - 16,251 - 18,66,83,664

మెట్‌పల్లి - 18,072 - 17,60,97,828

--------------------------------------------------------------------

మొత్తం - 2,48,550 - 251,14,13,131

--------------------------------------------------------------------

Updated Date - Jun 19 , 2025 | 12:46 AM