Share News

పత్తిపాక రిజర్వాయర్‌తో నెరవేరనున్న రైతుల ఆకాంక్ష

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:08 AM

జిల్లాలో పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల రైతుల చిరకాల ఆకాంక్ష నెరవేరనున్నదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయ డంతోపాటు అభివృద్ధి పనులు వేగంగా జరుగు తున్నాయని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఒబేదుల్లా కోత్వాల్‌ సాహెబ్‌ అన్నారు.

పత్తిపాక రిజర్వాయర్‌తో  నెరవేరనున్న రైతుల ఆకాంక్ష
కలెక్టరేట్‌ ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎండి ఒబేదుల్లా కొత్వాల్‌ సాహెబ్‌, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌

- డీపీఆర్‌ తయారీకి రూ.1.10 కోట్లు మంజూరు

- సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు

- అర్హులైన వారికి 6244 ఇందిరమ్మ ఇళ్లు

- రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో 161.02 కోట్లు జమ

- మహిళలకు ఉచిత ప్రయాణంతో రూ.155.80 కోట్లు ఆదా

- జిల్లాలో కొత్తగా 12,168 కుటుంబాలకు రేషన్‌ కార్డులు

- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఒబేదుల్లా కోత్వాల్‌ సాహెబ్‌

పెద్దపల్లి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల రైతుల చిరకాల ఆకాంక్ష నెరవేరనున్నదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయ డంతోపాటు అభివృద్ధి పనులు వేగంగా జరుగు తున్నాయని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఒబేదుల్లా కోత్వాల్‌ సాహెబ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినో త్సవ వేడుకలకు హాజరైన ఆయన పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సు లలో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టిం దని, దీని ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు మహిళ లకు 155 కోట్ల 80 లక్షల రూపాయలను ఆదా అయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం 500 సబ్సిడీ వంట గ్యాస్‌ అందిస్తున్నదని, జిల్లాలో ఇప్పటి వరకు 1,18,397 కుటుంబాలకు గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేసి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో 14 కోట్ల 3 లక్షల రూపాయలు జమ చేసిందన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు జిల్లాలోని 1,31,966 కుటుంబా లకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తున్నదని, ఈ పథకం ద్వారా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ప్రభు త్వం 85 కోట్ల 24 లక్షల రూపాయలు చెల్లిం చిందన్నారు.

ఫ జిల్లాలో 6244 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మొదటి విడతలో అర్హులైన వారికి 6244 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి 19 కోట్ల 52 లక్షల రూపాయల నిర్మాణాలు జరుపుకుంటున్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేశామని అన్నారు. రేషన్‌ షాపుల ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారికి ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దన్నారు. అలాగే నాలుగైదేళ్లుగా రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న 12,168 కుటుంబాలకు కొత్త కార్డులు జారీ చేశామని అన్నారు.

ఫ రైతులకు రైతు భరోసా కింద రూ. 161 కోట్లు

రైతులకు రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని 10 వేల నుంచి 12 వేల రూపాయ లకు పెంచామని, వానాకాలం పంటకు జిల్లాలో 1,51,507 మంది రైతుల ఖాతాలో 161 కోట్ల 2 లక్షల రూపాయలు జమ చేశామని ఆయన అన్నారు. యాసంగి సీజన్‌లో 62,621 మంది రైతుల నుంచి 926 కోట్ల విలువ గల 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లోగా చెల్లింపులు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్‌ పంటను 3158 ఎకరాలలో సాగు చేస్తున్న రైతులకు 4 కోట్ల 70 లక్షల సబ్సిడీ అందించామన్నారు. కాకతీయ కాలువ కింద ఉన్న 2.30 లక్షల ఎకరాలతో పాటు కొత్తగా 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు లక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్‌ను 3 నుంచి 5 టిఎంసీల సామ ర్థ్యంతో నిర్మాణానికి డీపీఆర్‌ తయారీకి ప్రభు త్వం కోటి 10 లక్షల రూపాయలు మంజూరు చేసిందన్నారు. 13,396 ఎకరాల ఆయకట్టు స్థిరీక రణ కోసం చేపట్టిన రామగుండం ఎత్తిపోతల పథకం పెండింగ్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి నీటి పారుదల శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించామన్నారు.

ఫ ఆసుపత్రుల నిర్మాణాలకు నిధులు

గోదావరిఖని జనరల్‌ ఆసుపత్రిని 160 కోట్లతో, కూనారం ఆర్‌ఓబీని 119 కోట్లతో నిర్మిస్తున్నామని అన్నారు. ఉపాధి హామీ పనుల కింద ప్రస్తుత సంవత్సరం 44,986 కుటుంబాలకు 11 లక్షల పని దినాల ఉపాధి కల్పించి 59 కోట్ల 55 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద జిల్లాలో మహిళా సంఘా లచే 27 స్టిచ్చింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి పాఠ శాల విద్యార్థుల ఏకరూప దుస్తులను కుట్టిస్తు న్నామని, 4 క్యాంటీన్‌, మొబైల్‌ ఫిష్‌ రిటైల్‌ ఔట్‌ లెట్‌లు ఏర్పాటు చేశామని, రెండు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన వంటి వివిధ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. మంథని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీకి ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ కేట గిరీలో దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతత్‌ వికాస్‌ పురస్కార అవార్డు లభించిందని అన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 173 కోట్లు ఖర్చు చేస్తూ సీసీ రోడ్లు, డైయ్రిన్లు, బీటీ రోడ్లు, శ్మశాన వాటికలు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, పురపాలక భవనం, డంప్‌ యార్డుల వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టామని, అమృత్‌ పథకం 2.0 కింద 293 కోట్ల 84 లక్షలతో సీవర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌లు నిర్మిస్తున్నామని అన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కవరేజీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి జిల్లాలో 28,550 మంది రోగులకు 68 కోట్ల 67 లక్షల రూపాయల విలువ గల చికిత్స లను ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందిం చామన్నారు. 23 కోట్ల 75 లక్షలతో గోదావరిఖని జనరల్‌ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌, 51 కోట్లతో పెద్దపల్లిలో 100 పడకల ఆసుపత్రి, 22 కోట్లతో మంథనిలో 50 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామని అన్నారు.

ఫ రూ. 15.81 కోట్లతో పాఠశాలల అభివృద్ధి..

భావితరాల మెరుగైన భవిష్యత్తుకు విద్యే పునాది. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమి టీల ద్వారా 15 కోట్ల 81 లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. రాబోయే విద్యా సంవ త్సరంలో ఏఐ టూల్స్‌, ఐఎఫ్‌పీ ప్యానల్స్‌ ద్వారా విద్యార్థులకు బోధించుటకు జిల్లాలోని ఉపాధ్యా యులకు శిక్షణ అందించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, బీసిలకు 42 శాతం రిజర్వేషన్‌తో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నా మని తెలిపారు. 561 మందికి ఉపాధి కల్పిస్తూ జిల్లాలో 39 కోట్ల పెట్టుబడితో 44 వ్యాపార యూనిట్‌లకు అనుమతులు మంజూరు చేశా మని, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కిం ద 12 యూనిట్‌లను మంజూరు చేశామని, టీ- ప్రైడ్‌, టీ-ఐడియా కింద 27 సేవా రంగ, తయారీ రంగ పరిశ్రమలకు 2 కోట్ల 41 లక్షల సబ్సిడీ విడుదల చేసిందన్నారు. జిల్లా అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు పాటు పడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఒబేదుల్లా కోత్వాల్‌ సాహెబ్‌ కృతజ్ఞతలు తెలి పారు. అనంతరం ముఖ్య అతిథి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 203 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు. 10వ తరగతి, ఇంటర్‌లో టాపర్లుగా నిలిచిన నలుగురు విద్యా ర్థులకు 10 వేల చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. మెప్మా కింద 148 స్వయం సహా యక మహిళా సంఘాలకు 17 కోట్ల 36 లక్షల 98 వేల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయర మణారావు, రాజ్‌ ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, అదనపు కలెక్టర్లు జెఅరుణశ్రీ, డి వేణు, డీసీపీ కరుణాకర్‌, ఆర్‌డీఓ బి గంగయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 01:08 AM