Share News

అన్ని విభాగాల్లో సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:40 AM

కరీంనగర్‌ నగరపాలక సంస్థ అన్ని విభాగాల్లో వసతులు, సౌకర్యాలు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

అన్ని విభాగాల్లో సౌకర్యాలు కల్పించాలి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ నగరపాలక సంస్థ అన్ని విభాగాల్లో వసతులు, సౌకర్యాలు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాయలంలోని పలు విభాగాలతోపాటు కార్యాలయ ఆవరణను అధికారులతో కలిసి ఆయన మంగళశారం పరిశీలించారు. టౌన్‌ ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, శానిటేషన్‌, రెవెన్యూ విభాగాలతోపాటు ఎస్టాబ్లిస్‌మెంట్‌, అకౌంట్స్‌, పౌర సేవా కేంద్రం, బర్త్‌, డెత్‌, రికార్డు విభాగాలు, ఆవరణలో ఉన్న పఠనాలయంతోపాటు కార్యాలయ ఆవరణను తనిఖీ చేశారు. సెక్షన్ల వారీగా తిరిగి అధికారులు, సిబ్బందిని వసతి, సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో కావాల్సిన వసతి, సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి సెక్షన్‌లో సెక్షన్‌ హెడ్స్‌కు చాంబర్స్‌ ఏర్పాటు చేయడంతోపాటు ఫర్నీచర్‌, ర్యాక్స్‌, కప్‌బోర్డులు ఏర్పాటు చేసి మంచినీటి వసతి, లైటింగ్స్‌, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెక్షన్ల వారీగా ఉన్న టాయిలెట్స్‌తోపాటు నగరపాలక సంస్థ ఆవరణలో ఉన్న టాయిలెట్లను పరిశుభ్రంగా చేయడంతోపాటు రిపేర్స్‌ ఉంటే చేయించాలని ఆదేశించారు. పలు సెక్షన్లకు పెయింటింగ్‌ చేయించి కార్యాలయం ఆవరణలో ఉన్న స్ర్కాప్‌ను తొలగించాలని కోరారు. సెక్షన్ల వారీగా సీసీ కెమెరాలను అమర్చాలని ఐసీ సీసీ ఏజెన్సీని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్‌, ఖాదర్‌ మోహియుద్దీన్‌, ఈఈలు సంజీవ్‌కుమార్‌, రొడ్డ యాదగిరి, ఇన్‌చార్జి డీసీపీ బషీరొద్దీన్‌, ఏసీపీ శ్రీధర్‌, డీఈలు లచ్చిరెడ్డి, ఓంప్రకాశ్‌, ఏఈ సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 12:40 AM