సహకార సంఘాల పాలకవర్గాల గడువు పొడిగింపు
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:29 AM
సుల్తానాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల పాలకవర్గాల గడువు మళ్ళీ పొడిగించారు. ప్రస్తుతం ఉన్న సహకార సంఘాల పాలకవర్గాల గడువు మరో ఆరు నెలల పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది. దీంతో సంఘాల పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా ఏడాది పాటు కొనసాగే వెసలుబాటును ప్రభుత్వం కల్పించినట్టయింది. అయితే ఈసారి ఉత్తర్వుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- సొసైటీలను పట్టించుకోని పాలకవర్గం స్థానంలో మార్పులు
- పర్సన్ ఇన్‌చార్జిల నియామకానికి అనుమతి
సుల్తానాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల పాలకవర్గాల గడువు మళ్ళీ పొడిగించారు. ప్రస్తుతం ఉన్న సహకార సంఘాల పాలకవర్గాల గడువు మరో ఆరు నెలల పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది. దీంతో సంఘాల పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా ఏడాది పాటు కొనసాగే వెసలుబాటును ప్రభుత్వం కల్పించినట్టయింది. అయితే ఈసారి ఉత్తర్వుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఎవరైతే సంఘాల నిర్వహణలో ఉదాసీ నంగా ఉండడం, అసలు పట్టించుకోకపోవడం లేదా ఏమైన ఆరోపణలు ఉంటే వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవచ్చని ఉత్తర్వులో పేర్కొనడం గమనా ర్హం. సహకార సంఘాల పాలకవర్గాల గడువు వాస్త వంగా ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకే ముగిసింది. కానీ సింగిల్‌విండోలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం వాటిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 14 వరకు సంఘాల గడువు ఉంది. ఈ సారి కూడా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో గురువారం గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పొడగింపు ఉత్తర్వుల మేరకు పాలకవర్గాలు గతంలో లాగా పూర్తి స్థాయిలో కాకుండా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సారి అసలు పొడిగింపు ఉండదని ప్రత్యే కాధికారులను నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఒక రోజు ముందుగా పొడిగింపు ఉత్తర్వులు జారీ అవడం పాలకవర్గాలకు తీపి కబురే.
ఫ 2019లో సంఘాలకు ఎన్నికలు
జిల్లాలో ఇరవై సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు 2019లో గత ప్రభుత్వ హయాంలో ఎన్ని కలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గడువు పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరునెలలు పొడిగించారు. ప్రస్తుతం మరోసారి పొడిగింపే జరిగింది.
ఫ ఆశావహుల్లో నిరాశ
సహకార సంఘాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో కొంత నిరాశ నెలకొంది. సహకార సంఘాల అధ్యక్షులు, డైరక్టర్లు చాలా మంది గత ప్రభుత్వ హయాంలోని పార్టీలకు చెందిన వారే అధికంగా ఉన్నా రని, సకాలంలో ఎన్నికలు నిర్వహించనట్టయితే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు అవ కాశాలు వచ్చేవని భావిస్తున్నారు. రెండోసారి కూడా పొడిగింపు ఉత్తర్వులు రావడంతో సహకార సంఘాల పదవులపై అశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు కార్యకర్తలకు తీవ్ర ఆశాభంగం కలిగినట్టుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం
మంథని, (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, రాష్ట్ర వ్యవ సాయ, సహకారం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుల చిత్రపటాలకు సింగిల్‌విండో కార్యాలయంలో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలకవర్గం గురు వారం క్షీరాభిషేకం చేశారు. పాలకవర్గం గడువును ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించడంపై చైర్మన్ కొత్తశ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ క్షీరాభిషేకం చేశారు. చైర్మన్ మాట్లాడుతూ రైతులకు మరో ఆరు నెలలు సేవచేసే అవకాశం ప్రభుత్వం కల్పిం చడం హర్షనీయమన్నారు. డైరెక్టర్లు పెద్దిరాజు ప్రభాకర్, సిరిమూర్తి ఓదెలు, గడ్డం పోచం, లెక్కల కిషన్‌రెడ్డి, కొత్త శ్రీనివాస్, దేవళ్ళ విజయ్‌కుమార్, దాసరి లక్ష్మిమొండ య్య, ఉడుత మాధవిపర్వతాలు యాదవ్‌లు పాల్గొన్నారు.