ప్రణాళిక ప్రకారం విస్తరణ పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:22 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. హరిత ఆదేశించారు. రాజన్న, భీమేశ్వర ఆలయంలో జరుగుతున్న అభిషేకం, అన్నపూజ, కోడెక్యూలైన్ కౌంటర్స్
వేములవాడ కల్చరల్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. హరిత ఆదేశించారు. రాజన్న, భీమేశ్వర ఆలయంలో జరుగుతున్న అభిషేకం, అన్నపూజ, కోడెక్యూలైన్ కౌంటర్స్, ప్రసాదం తయారీ విభాగం, నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం మండపాల పనులను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆలయ అతిథి గృహంలో వీటీడీఏ, ఆలయ అధికారులు, అర్చకులు, సబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్దిపై రూపొందింఇన నమూనాను కలెక్టర్‌కు క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి క్షుణ్ణంగా వివరించారు. ప్రస్తుతం ఉన్న భవనాల కూల్చివేత పనులు, ప్రణాళిక ప్రకారం చేపడుతున్న చర్యలపై ఆరాతీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఆలయ విస్తరణకు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రోజూ వారీగా చేపట్టే పనుల వివరాలు ఇవ్వాలని సూచించారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. వచ్చే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ముందు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇబ్బం దులు తలెత్తకుండా పనులు పూర్తి చేసేందకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సంబంధిత ఉద్యోగులను ఆదేశించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి, ఆలయ ఈవో రమాదేవి, క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్యసత్యనారాయణ మూర్తి, అధికారులు నరసింహచారి, అన్వేష్, విజయప్రకాశ్‌రావు, అన్సార్ తదితరులు ఉన్నారు.