నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:45 AM
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియో గించుకోవాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు.
చందుర్తి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియో గించుకోవాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. చందుర్తి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఎస్పీ మహేష్ గీతే ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నిక లలో భాగంగా జరిగే పోలింగ్‌కు ఓటర్లు హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగిం చుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాం త వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్‌లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియ మావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్లాగ్ మార్చ్‌లో ఎస్‌ఐలు జిల్లా రమేష్, బి, శ్రీని వాస్‌లు, జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.